Telangana Corona News : తెలంగాణలో తగ్గిన కరోనా.. 17 జిల్లాల్లో సున్నా కేసులు

తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 20వేల 496 కరోనా టెస్టులు నిర్వహించగా, 67 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది.(Telangana Corona News)

Telangana Covid Report

Telangana Corona News : తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 20వేల 496 కరోనా టెస్టులు నిర్వహించగా, 67 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. గ్రేటర్ హైదరాబాద్ లో అత్యధికంగా 31 కేసులు, రంగారెడ్డి జిల్లాలో 10 కేసులు నమోదయ్యాయి. కాగా, 17 జిల్లాల్లో కొత్త కేసులేవీ నమోదు కాకపోవడం ఊరటనిచ్చే అంశం. అదే సమయంలో 92 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్తగా మరణాలేవీ సంభవించలేదు. గడిచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో ఒక్క కరోనా మరణం కూడా నమోదు కాలేదు. మరో 92మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు.

రాష్ట్రంలో ఇంకా 713 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 4వేల 111. రాష్ట్రంలో ఇప్పటివరకు 7లక్షల 90వేల 756 కోవిడ్ కేసులు నమోదవగా.. 7లక్షల 85వేల 932 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో నేటి వరకు 3కోట్ల 39లక్షల 83వేల 991 కోవిడ్ పరీక్షలు చేశారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ శనివారం కరోనా బులెటిన్ విడుదల చేసింది. క్రితం రోజు 16వేల 241 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 52 పాజిటివ్ కేసులు వచ్చాయి.(Telangana Corona News)

అటు దేశంలోనూ కరోనా వ్యాప్తి అదుపులోనే ఉంది. మన దేశంలో కరోనా తీవ్రత… ప్రారంభ రోజుల స్థాయికి క్షీణిస్తోంది. కొన్ని రోజులుగా కొత్త కేసులు 3 వేల దిగువనే నమోదవుతున్నాయి. మరణాల్లో మాత్రం హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయి. 24 గంటల వ్యవధిలో దేశంలో 2,075 కొత్త కేసులు నమోదయ్యాయి. మరో 71 మంది కోవిడ్ తో మరణించారు. గడిచిన 24గంటల్లో 3.7 లక్షల కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. పరీక్షల సంఖ్య తగ్గినప్పటికీ.. పాజిటివిటీ రేటు మాత్రం ఒకశాతం దిగువనే ఉంది. ఇక ఇప్పటివరకూ 4.30 కోట్ల మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా… 5.16 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు.

Covid 4th Wave Alert : కరోనా నాల్గో వేవ్‌ ముప్పు.. రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలి : కేంద్రం

ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 27వేల 802కి తగ్గిపోయింది. మొత్తం కేసుల్లో ఆ వాటా 0.06 శాతానికి సమానంగా ఉంది. ఇక నిన్న 3,383 మంది కోలుకోగా.. నిన్నటివరకూ 4.24 కోట్ల మంది వైరస్‌ను జయించారు. రికవరీ రేటు 98.73 శాతానికి పెరిగింది. నిన్న 5.84 లక్షల మంది టీకా వేయించుకోగా.. మొత్తంగా 181 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయ్యాయని కేంద్రం తెలిపింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ శనివారం కరోనా బులెటిన్ విడుదల చేసింది.

కరోనా కేసులు తగ్గుముఖం పట్టినా.. దాని కారణంగా వచ్చే బాధలు మాత్రం బయటపడుతూనే ఉన్నాయి. కంటి నుంచి కాలి వరకూ అన్ని అవయవాలపైనా దుష్ప్రభావాలు కనిపిస్తూనే ఉన్నాయి. మోతాదుకు మించి స్టెరాయిడ్‌ చికిత్స పొందిన రోగుల్లో తాజాగా తుంటికీలు సమస్య తెరపైకి వచ్చింది.

India Covid : భారత్‌‌లో కరోనా తగ్గుముఖం.. 24 గంటల్లో 2,528 కేసులు

రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ ఉధృతి 2021 మార్చిలో మొదలై.. ఏప్రిల్‌-ఆగస్టు వరకూ ఉధృతంగా కొనసాగింది. వేల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. అప్పుడున్న పరిస్థితుల్లో స్టెరాయిడ్స్‌ చికిత్స అనివార్యమైంది. కానీ వాటిని విచ్చలవిడిగా వినియోగించడం వల్ల మ్యూకర్‌ మైకోసిస్‌ (బ్లాక్‌ఫంగస్‌) జబ్బు బారినపడి.. కనుగుడ్డు తీయాల్సి వచ్చిన బాధితులు కూడా వేలల్లో నమోదయ్యారు. ఇప్పుడు ఆ బాధల్లో తుంటికీలు కూడా చేరింది. ఏడాది కిందట వాడిన స్టెరాయిడ్స్‌ ప్రభావం ఇప్పుడు బయటపడుతోంది.