India Covid : భారత్‌‌లో కరోనా తగ్గుముఖం.. 24 గంటల్లో 2,528 కేసులు

గత 24 గంటల్లో 149 మంది వైరస్ బారిన పడి చనిపోయారని, బుధవారం ఈ సంఖ్య 60గా ఉందని తెలిపింది. ఇప్పటి వరకు 4.30 కోట్ల మందికి వైరస్ సోకగా... 5.06 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారని పేర్కొంది

India Covid : భారత్‌‌లో కరోనా తగ్గుముఖం.. 24 గంటల్లో 2,528 కేసులు

India Covid

India Recorded Corona Cases : భారతదేశంలో క్రమేపీ కరోనా తగ్గుముఖం పడుతోంది. కొన్ని రోజులుగా వెల్లడవుతున్న కేసుల సంఖ్య ఊరటనిచ్చే విధంగా ఉంటున్నాయి. మూడు వేల లోపు పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. 2022, మార్చి 17వ తేదీ గురువారం ఒక్క రోజు 6 లక్షల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా… 2 వేల 528 మంది వైరస్ ఉన్నట్లు తేలిందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. మరణాల విషయంలో పెరుగుదల, తగ్గుదల కనిపిస్తోందని తెలిపింది.

Read More : Corona New Variant: ఇజ్రాయిల్ లో కరోనా కొత్త వేరియంట్..!

గత 24 గంటల్లో 149 మంది వైరస్ బారిన పడి చనిపోయారని, బుధవారం ఈ సంఖ్య 60గా ఉందని తెలిపింది. ఇప్పటి వరకు 4.30 కోట్ల మందికి వైరస్ సోకగా… 5.06 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారని పేర్కొంది. మొత్తంగా కరోనా అదుపులో ఉందని, 30 వేల దిగువకు చేరి మొత్తం కేసుల్లో 0.07 శాతానికి క్షీణించాయని తెలిపింది. ఒక్కరోజులో 3 వేల 997 మంది కరోనా నుంచి కోలుకోవడం జరిగిందని వైద్యాధికారులు వెల్లడించారు. మరోవైపు కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా కొనసాగుతోందని, ఇప్పటి వరకు 180.9 కోట్ల మందికి టీకాలు వేయడం జరిగిందని పేర్కొంది. ఒక్కరోజులో 15.7 లక్షల మంది కరోనా టీకాలు వేసుకున్నారని అధికారులు వెల్లడించారు.

Read More : Israel Covid Variant : ఇజ్రాయెల్‌లో కొత్త కరోనా వేరియంట్.. లక్షణాలివే? ప్రాణాంతకమా? నిపుణులు ఏమంటున్నారంటే?

ఇదిలా ఉంటే భారతదేశంలో కరోనా తగ్గుముఖం పడుతుంటే.. ప్రపంచంలోని వివిధ దేశాల్లో కరోనా మరోసారి విరుచుకపడుతోంది. చైనాలోని పలు నగరాల్లో ఇప్పటికే లాక్ డౌన్ విధించారు. దేశంలో కరోనా నాల్గో వేవ్ ముప్పు పొంచి ఉందనే సంకేతాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం హైఅలర్ట్ ప్రకటించింది. స్కూళ్లు తిరిగి తెరవడం, ఆఫీసులకు వెళ్లడం, మాస్క్‌ నిబంధనలను సడలించడం వంటి కారణాలు కూడా అయి ఉండొచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జనంతో రద్దీగా ప్రాంతాలు కనిపిస్తున్నాయి. దేశంలో కరోనా కేసులకు సంబంధించి కేంద్ర కుటుంబ సంక్షేమ‌, ఆరోగ్య మంత్రి మ‌న్సుఖ్ మాండ‌వీయ అధికారుల‌తో ఉన్న‌త స్థాయి స‌మావేశం నిర్వ‌హించారు. ప్రధానంగా కేసుల పెరుగుద‌ల‌, జీనోమ్ సీక్వెన్సీ, ఇన్‌ఫెక్ష‌న్ పెరుగుద‌ల‌ వంటి మూడు అంశాలపై దృష్టి సారించాల‌ని మాండ‌వీయ అధికారుల‌ను ఆదేశించారు.