పాఠశాలలకు 50రోజులు సమ్మర్ హాలిడేస్.. ఉత్తర్వులు జారీ చేసిన అధికారులు

జూన్ 11వ తేదీ వరకు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు మూతపడనున్నాయి. తిరిగి జూన్ 12 నుంచి పాఠశాలలు పున: ప్రారంభం కానున్నాయి.

Telangana School Summer Vacations 2024 : తెలంగాణలో వేసవి ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఎండల తీవ్రతతో పాటు ఉక్కపోత కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దీనికితోడు విద్యార్థులు పాఠశాలలకు వెళ్లేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో పాఠశాలలకు ప్రభుత్వం వేసవి సెలవులు ప్రకటించింది. ఈ మేరకు అధికారులు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇవాళ్టి నుంచి జూన్ 11వ తేదీ వరకు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు మూతపడనున్నాయి. 50 రోజుల తరువాత తిరిగి జూన్ 12 నుంచి ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు పున: ప్రారంభం కానున్నాయి.

Also Read : అలా చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా: సీఎం రేవంత్ సవాల్ స్వీకరించిన హరీశ్ రావు

ఎండల తీవ్రత కారణంగా మార్చి 15 నుంచి ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో హాఫ్ డే స్కూల్ నిర్వహించారు. అయితే, ఎండల తీవ్రత ఎక్కువ కావడంతో జూన్ 11వ తేదీ వరకు అధికారులు సమ్మర్ హాలిడేస్ ప్రకటించారు. అదేవిధంగా తెలంగాణ ఇంటర్మీడియట్ కళాశాలలు మార్చి 30 నుంచి మే 31వ తేదీ వరకు హాలిడేల్స్ ఇచ్చాయి. తిరిగి జూన్ 1వ తేదీన పున: ప్రారంభం అవుతాయి.

ట్రెండింగ్ వార్తలు