TS Schools Open : తెలంగాణలో 16 నుంచి స్కూళ్లు ప్రారంభమయ్యే అవకాశం

తెలంగాణలో కరోనా తగ్గుముఖం పట్టడంతో రాష్ట్రంలో విద్యాసంస్థలు పున:ప్రారంభమ్యే అవకాశం కనిపిస్తోంది.

Telangana Schools Open : తెలంగాణలో కరోనా తగ్గుముఖం పట్టడంతో రాష్ట్రంలో విద్యాసంస్థలు పున:ప్రారంభమ్యే అవకాశం కనిపిస్తోంది. విద్యాశాఖ ఉన్నతాధికారులతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమీక్ష నిర్వహించారు. విద్యా సంస్థల పున: ప్రారంభంపై చర్చించారు. ఇంటర్, పాఠశాలల ఆన్ లైన్ తరగతుల నిర్వహణపైనా చర్చించారు. ఈ ఏడాది విద్యా సంస్థల ప్రారంభానికి ముహుర్తం ఖరారైనట్టు సమాచారం.

స్కూల్స్, ఇంటర్ ఆన్ లైన్ తరగతుల నిర్వహణపై చర్చ జరుగుతోంది. విద్యా సంస్థల ప్రారంభానికి తేదీ కూడా ఖరారైంది. ఈ నెల 16 నుంచి విద్యాసంస్థల ప్రారంభానికి ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది. 8,9,10 తరగతులకు ఆన్ లైన్ క్లాసులు నిర్వహించే యోచనలో విద్యాశాఖ ఉన్నట్టు సమాచారం.

మరోవైపు.. తెలంగాణలో లాక్ డౌన్ మరో 10 రోజులు పొడిగించిన ప్రభుత్వం.. ఆంక్షలను కూడా సడలించింది. ఇప్పటివరకూ ఉన్న ఆంక్షల సమయాల్లో మార్పులు చేసింది. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆంక్షలను సడలించారు. సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకూ లాక్ డౌన్ కొనసాగనుంది. రాష్ట్రంలో కర్ఫ్యూను పక్కాగా అమలు చేయనుంది.

మంగళవారం (జూన్ 8)న కేబినెట్ సమావేశంలో లాక్ డౌన్ పొడిగింపుపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సాయంత్రం 5 గంటల తర్వాత ఓ గంట పాటు ఇళ్లకు వెళ్లేందుకు వెసులుబాటు కల్పించారు. ఎల్లుండి నుంచి కొత్త ఆంక్షలు అమల్లోకి రానున్నాయి.

ట్రెండింగ్ వార్తలు