Sheep Distribution Scam Update
Sheep Distribution Scam : గొర్రెల పంపిణీ పథకం కేసులో ఏసీబీ దర్యాఫ్తు ముమ్మరం చేసింది. పశు సంవర్థక శాఖలో పని చేస్తున్న నలుగురు అధికారులను అరెస్ట్ చేశారు. అసిస్టెంట్ డైరెక్టర్ ధర్మపురి రవి, డిప్యూటీ డైరెక్టర్ రఘుపతి రెడ్డి, డిప్యూటీ డైరెక్టర్ సంగు గణేశ్, అసిస్టెంట్ డైరెక్టర్ ఆదిత్య కేశవ సాయిలను అదుపులోకి తీసుకుని ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టారు.
ప్రైవేట్ వ్యక్తులతో కలిసి బినామీ ఖాతాలు తెరిచిన ఈ నలుగురు.. 2కోట్ల 10లక్షల రూపాయలను మళ్లించినట్లు ఏసీబీ అధికారుల ప్రాథమిక దర్యాఫ్తులో తేలింది.
Also Read : ఆరోజు నుంచే ఉచిత విద్యుత్, రూ.500కే సిలిండర్.. తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్