ఆరోజు నుంచే ఉచిత విద్యుత్, రూ.500కే సిలిండర్.. తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్

ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులైన వారందరికీ లబ్ది జరిగేలా చూడాలని ముఖ్యమంత్రి రేవంత్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

ఆరోజు నుంచే ఉచిత విద్యుత్, రూ.500కే సిలిండర్.. తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్

Telangana Government On Guarantees

Telangana Government : మరో రెండు గ్యారంటీల అమలుకు తెలంగాణ సర్కార్ సిద్ధమైంది. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్ సిలిండర్ గ్యారంటీల అమలు విధివిధానాలపై కేబినెట్ సబ్ కమిటీతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ నెల 27 లేదా 29వ తేదీన రెండు గ్యారంటీలు ప్రభుత్వం అమలు చేయనుంది.

గృహలక్ష్మితో పాటు రూ.500కే వంట గ్యాస్ సిలిండర్ పథకాన్ని రేవంత్ సర్కార్ ప్రారంభించనునంది. గృహలక్ష్మి, గ్యాస్ సిలిండర్ పథకాల అమలుకు రంగం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులైన వారందరికీ లబ్ది జరిగేలా చూడాలని ముఖ్యమంత్రి రేవంత్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ సెక్రటేరియట్ లో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి కేబినెట్ సబ్ కమిటీతో సమీక్ష నిర్వహించారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ముఖ్యమంత్రి సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు.

అధికారంలోకి వస్తే ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. చెప్పినట్టుగానే అధికారంలోకి వచ్చిన వెంటనే.. రెండు గ్యారంటీలు ప్రారంభించింది. మొత్తం 6 గ్యారంటీలలో.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్య శ్రీ పరిమితి రూ.10లక్షలకు పెంపు గ్యారంటీలను ప్రభుత్వం ఇప్పటికే అమలు చేస్తోంది. త్వరలోనే మరో రెండు పథకాలు ఉచిత కరెంట్, గ్యాస్ సిలిండర్ స్కీమ్ లను కూడా ప్రారంభించనుంది.

అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని ప్రభుత్వం చెప్పింది. ఇప్పటికే రెండు అమలు చేసింది. మరో రెండింటికి త్వరలో శ్రీకారం చుట్టనుంది. ఇక పెన్షన్లు, ఇందిరమ్మ ఇళ్లు, 5లక్షల గ్యారెంటీ కార్డు స్కీమ్ లు మిగిలున్నాయి.

ఈ రెండు పథకాలను ప్రియాంక గాంధీ చేతుల మీదుగా ప్రారంభిస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ రెండు పథకాల కోసం ప్రజాపాలనతో దాదాపు కోటి 9లక్షల దరఖాస్తులు వచ్చాయి. అందులో 500 గ్యాస్ సిలిండర్ కోసం 92లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఉచిత విద్యుత్ కోసం 82 లక్షల మంది అప్లయ్ చేసుకున్నారు. ఈ రెండు స్కీమ్స్ అమలు చేసేందుకు ప్రభుత్వం రెడీ అయ్యింది. వీటిని ఏ విధంగా అమలు చేయాలి అనే దానిపై అధికారుల ఫీడ్ బ్యాక్ తీసుకుంది ప్రభుత్వం.

Also Read : నీటి పోరు యాత్ర.. మరో ఉద్యమానికి సిద్ధమైన బీఆర్‌ఎస్‌!