TS Police Recruitment: 7,437 పోలీస్ ఉద్యోగాలు.. దరఖాస్తుకు రేపే లాస్ట్ డేట్.. వెంటనే అప్లై చేసుకోండి!

తెలంగాణలోని నిరుద్యోగ యువతకు, పోలీసు (TS Police Recruitment)ఉద్యోగ అభ్యర్థులకు ఇది అత్యంత కీలకమైన సమాచారం.

Telangana si, constable jobs application deadline ends tomorrow

  • రేపటితో దరఖాస్తు గడువు ముగింపు
  • 7,437 పోలీస్ పోస్టుల భర్తీ
  • వయోపరిమితి పెంచిన రాష్ట్ర ప్రభుత్వం

TS Police Recruitment: తెలంగాణలోని నిరుద్యోగ యువతకు, పోలీసు ఉద్యోగ అభ్యర్థులకు ఇది అత్యంత కీలకమైన సమాచారం. తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (TSLPRB) చేపట్టిన 7,437 ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి దరఖాస్తుల గడువు రేపటితో అంటే సెప్టెంబర్ 16తో ముగియనుంది. ఇప్పటికే సిద్ధమైన అర్హులైన అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

Chandrababu Tirumala Visit: ప్రారంభమైన శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. పట్టువస్త్రాల సమర్పించిన చంద్రబాబు.. ఏపీ సీఎం సరికొత్త రికార్డ్

దరఖాస్తు గడువు పొడిగింపు.. చివరి అవకాశం!

వాస్తవానికి ఈ పోస్టుల దరఖాస్తు ప్రక్రియ ఈ నెల 9వ తేదీతోనే పూర్తి కావాల్సి ఉంది. అయితే అభ్యర్థుల నుంచి వచ్చిన విజ్ఞప్తులు, సాంకేతిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని రిక్రూట్‌మెంట్ బోర్డ్ గడువును సెప్టెంబర్ 16 వరకు పొడిగించింది. దరఖాస్తు చేసుకోని అభ్యర్థులు ముగింపు సమయం వరకు వేచి చూడకుండా TSLPRB అధికారిక వెబ్‌సైట్ https://www.tgprb.in/ ద్వారా వెంటనే ఆన్‌లైన్ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది.

వయోపరిమితి సడలింపు.. నోటిఫికేషన్ వివాదం:

మరోవైపు కానిస్టేబుల్(TS Police Recruitment) తో పాటు ఇతర పోస్టులకు సంబంధించి ప్రభుత్వం గరిష్ట వయోపరిమితిని పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. అయితే నోటిఫికేషన్ లో పోస్టుల సంఖ్య తక్కువగా ఉందంటూ పలువురు నిరుద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకత, ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. పోస్టుల సంఖ్యను పెంచాలని, దరఖాస్తు తేదీని మరికొన్ని రోజులు పొడిగించాలని అభ్యర్థులు కోరుతున్న నేపథ్యంలో బోర్డు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.