Chandrababu Tirumala Visit: ప్రారంభమైన శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. పట్టువస్త్రాల సమర్పించిన చంద్రబాబు.. ఏపీ సీఎం సరికొత్త రికార్డ్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu Tirumala Visit)కలియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్య సన్నిధిలో మరో అరుదైన మైలురాయిని చేరుకోనున్నారు.
Ap cm Chandrababu tirumala visit srivari brahmotsavam pattu vastralu
- తిరుమలలో సీఎం చంద్రబాబు పర్యటన
- శ్రీవారికి పట్టువస్త్రాల సమర్పణ రికార్డు
- బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
Chandrababu Tirumala Visit: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కలియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్య సన్నిధిలో మరో అరుదైన మైలురాయిని చేరుకోనున్నారు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల ప్రారంభం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించేందుకు ఆయన రెండు రోజుల తిరుమల పర్యటనకు విచ్చేశారు. సాయంత్రం రేణిగుంట విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో తిరుమలకు చేరుకోనున్న సీఎంకు అధికారులు, ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలకనున్నారు.
Telangana Congress: మీనాక్షి నటరాజన్ అవుట్.. తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త ఇంచార్జ్.. ఎవరో తెలుసా?
15వ సారి పట్టువస్త్రాల సమర్పణ.. చారిత్రాత్మక రికార్డు:
సాయంత్రం తిరుమల చేరుకున్న అనంతరం సీఎం చంద్రబాబు(Chandrababu Tirumala Visit) రాత్రి బేడి ఆంజనేయస్వామి ఆలయం నుంచి మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి చేరుకుంటారు. స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు. ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించడం ఇది 15వ సారి కావడం విశేషం. 1983 నుంచి టీటీడీలో అమలవుతున్న ఈ సాంప్రదాయంలో ఎన్టీఆర్ తర్వాత అత్యధిక సార్లు పట్టువస్త్రాలు అందించిన సీఎం ఘనత ఆయనకే దక్కుతుంది. దర్శనానంతరం టీటీడీ 2027 క్యాలెండర్లు, డైరీలను ఆవిష్కరించి పెద్ద శేష వాహన సేవలో పాల్గొంటారు.
రేపటి కార్యక్రమాలు.. బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు!
పర్యటనలో భాగంగా రెండో రోజు ఉదయం పద్మావతి అతిథి గృహంలో టీటీడీ అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించనున్నారు. అనంతరం ఎస్వీ మ్యూజియం, ఎలక్ట్రిక్ బస్సులు, పిలిగ్రిమ్స్ ఎక్స్పీరియన్స్ సెంటర్‌తో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తారు. ఇదిలా ఉండగా, ధ్వజారోహణంతో ప్రారంభమయ్యే బ్రహ్మోత్సవాల కోసం టీటీడీ మాడవీధుల్లో 190 గ్యాలరీలను సిద్ధం చేసింది. నాలుగు మాడవీధుల్లో దాదాపు 1.80 లక్షల మంది భక్తులు వాహన సేవలను ఎలాంటి ఇబ్బందులు లేకుండా వీక్షించేలా చర్యలు చేపట్టారు.
