Ts Police
SI and Constable Preliminary Exam Result: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 554 ఎస్‌ఐ పోస్టులకు ఆగస్టు 7న, 15,644 కానిస్టేబుల్, 63 ట్రాన్స్‌పోర్టు కానిస్టేబుల్, 614 ప్రొహిబిషన్, ఎక్సైజ్ కానిస్టేబుల్స్ పోస్టులకు ఆగస్టు 28న రాత పరీక్ష నిర్వహించిన విషయం విదితమే. ఇందుకు సంబంధించిన ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. ఈ మేరకు తెలంగాణ స్టేట్ లెవల్ పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు ఫలితాలను ప్రకటించింది.
WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..
మొత్తం ఎస్‌ఐ పోస్టులకు 2,25,668 మంది రాత పరీక్ష రాయగా 1,05,603(46.80 శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు. సివిల్ కానిస్టేబుల్ పోస్టులకు 5,88,891 మంది రాత పరీక్ష రాయగా 1,84,861(31.39 శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు. అదేవిధంగా ట్రాన్స్‌పోర్టు కానిస్టేబుల్ పోస్టులకు 41,835 మంది రాత పరీక్ష రాయగా 18,758(44.84 శాతం) మంది, ప్రొహిబిషన్, ఎక్సైజ్ కానిస్టేబుల్ పోస్టులకు 2,50,890 మంది రాత పరీక్ష రాయగా, 1,09,518 (43.65 శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు.
SI and Constable Preliminary Exam Result