తెలంగాణ బిల్లుపై ప్రణబ్ సంతకం..ఆయన కర్మయోగి – సీఎం కేసీఆర్

  • Publish Date - September 7, 2020 / 01:28 PM IST

రాష్ట్ర అవతరణకు సహాయపడిన వారిగా కాకుండా..రాష్ట్ర విభజన బిల్లుపై ముద్ర వేసిన ప్రణబ్ తెలంగాణ రాష్ట్ర చరిత్రలో నిలిచిపోయారని తెలంగాణ సీఎం కేసీఆర్ వెల్లడించారు. ప్రణబ్ ముఖర్జీ మృతి ప‌ట్ల తెలంగాణ శాస‌న‌స‌భ సంతాపం తెలుపుతూ ఏక‌గ్రీవంగా తీర్మానిస్తుంది అని తెలిపారు.

2020, సెప్టెంబర్ 07వ తేదీ వర్షాకాల శాసనసభా సమావేశాలు ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభం కాగానే…ప్ర‌ణ‌బ్ మృతి ప‌ట్ల సంతాప తీర్మానాన్ని రాష్ర్ట సీఎం కేసీఆర్ స‌భ‌లో ప్ర‌వేశ‌పెట్టారు.



ఆయన కుటుంబసభ్యులకు తెలంగాణ శాసనసభ ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తోందని తెలిపారు. ఒక మహోన్నత నాయకుడిని కోల్పోయిందని, కేంద్ర మంత్రిగా, రాష్ట్రపతిగా దేశానికి ఎనలేని సేవలు చేశారన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ చరిత్రలో ప్రణబ్ కు అనుబంధం ఉందని, పార్టీల అభిప్రాయ సేకరణ కమిటీకి ప్రాతినిధ్యం వహించారన్నారు.
https://10tv.in/last-rites-of-former-president-pranab-mukherjee-to-be-held-today-following-covid-19-guidelines/
1970 తర్వాత దేశాభిభివృద్ధిలో ప్రణబ్ ముఖర్జీకి ప్రత్యేక స్థానం ఉందన్నారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థను అత్యున్నతస్థాయిలో నిలిబెట్టిన వ్యక్తి..మంచి ఆర్థిక వేత్తగా పేరు గడించారన్నారు. రాజకీయాల్లో ఆయన పాత్ర చిరస్మరణీయమని సీఎం కేసీఆర్ కొనియాడారు.



కరోనా వైరస్‌ నేపథ్యంలో కోవిడ్‌ నిబంధనల్ని పాటిస్తూ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు సోమవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యాయి. సమావేశ మందిరం, బయటా సభ్యులు సోషల్ డిస్టెన్స్ పాటించారు. పార్టీలకతీతంగా కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. నెగటివ్ వచ్చిన వారికి మాత్రమే లోపలకు అనుమతించారు.




ఈ సందర్భంగా తొలుగ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడారు. కోవిడ్‌ నియంత్రణ జాగ్రత్తలు చదివి వినిపించారు. జ్వరం, దగ్గు, జలుబు ఉంటే సభ్యులు ఇంటి దగ్గరే ఉండాలి. తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలి. శానిటైజర్లను తరుచూ ఉపయోగిస్తూ ఉండాలి. సభ్యుల మధ్య కనీసం 6 అడుగుల దూరం ఉండేలా చూసుకోవాలి. సాధ్యమైనంత వరకు లిఫ్ట్‌ను ఉపయోగించరాదని స్పీకర్‌ సభ్యులకు సూచించారు.