TS TET 2025 Exam Schedule : తెలంగాణ టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ (టీజీటెట్) పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది. జూన్ 18వ తేదీ నుంచి టెట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. తొలుత షెడ్యూల్ ప్రకారం.. జూన్ 15 నుంచి పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. అయితే, తాజాగా విడుదలైన టీజీ టెట్ షెడ్యూల్ ప్రకారం జూన్ 18 నుంచి టెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. జూన్ 30వ తేదీతో పరీక్షలు ముగుస్తాయి. ఈ మేరకు విద్యాశాఖ సబ్జెక్టుల వారీగా షెడ్యూల్ ను ప్రకటించింది.
ఈనెల 18 నుంచి 30వ తేదీ వరకు టీజీటెట్ పరీక్షలు కొనసాగనున్నాయి. దీనికి సంబంధించిన షెడ్యూల్ ను స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఈవీ నర్సింహారెడ్డి, టెట్ కన్వీనర్ జి. రమేష్ రిలీజ్ చేశారు. మొత్తం తొమ్మిది రోజుల పాటు 16 సెషన్లలో ఈ పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు.
ఉదయం 9గంటల నుంచి 11.30 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి 4.30 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. ఈ నెల 18, 19, 24, 30 తేదీల్లో పేపర్ 2 మ్యాథ్స్, సైన్స్ సబ్జెక్టులకు, 20, 24, 27 తేదీల్లో పేపర్ 1కు పరీక్షలు నిర్వహించనున్నారు. ఇక 28, 29, 30 తేదీల్లో పేపర్ 2 సోషల్ స్టడీస్ పేపర్ ఎగ్జామ్స్ ఉంటాయి.
టెట్ పరీక్షలకు మొత్తం 1,83,653 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో పేపర్ -1 పరీక్షకు 63, 261 మంది, పేపర్-2 పరీక్షకు 1,20,392 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ టెట్ పరీక్షలకు సంబంధించిన టీజీ టెట్ హాల్ టికెట్లు జూన్ 9న విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ఈసారి హైదరాబాద్, నిజామాబాద్, జగిత్యాల, పటాన్‌చెరు, సంగారెడ్డి నల్గొండ, ఖమ్మం, వరంగల్, సిరిసిల్ల, మంచిర్యాల, ములుగు, మహబూబ్‌నగర్, మెదక్ జిల్లాల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు షెడ్యూల్ లో పేర్కొన్నారు.