Youtuber Anvesh Representative Image (Image Credit To Original Source)
Youtuber Anvesh: యూట్యూబర్ అన్వేష్ కు మరో షాక్ తగిలింది. “నా అన్వేషణ” యూట్యూబ్ ఛానల్‌పై తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్‌కు వరుసగా ఫిర్యాదులు అందాయి. మహిళలపై అవమానకర, అసభ్య వ్యాఖ్యలు చేస్తున్నాడని ఆరోపణలు వెల్లువెత్తాయి. మహిళలను వస్తువుల్లా చూపించే కంటెంట్ ప్రసారం చేస్తున్నట్లు ఫిర్యాదు చేశారు. అతడి చేసిన కొన్ని వీడియోల్లో చట్టవిరుద్ధ అంశాలు ఉన్నాయని కమిషన్ పరిశీలించింది. బాలల హక్కులకు భంగం కలిగించే కంటెంట్ ఉందన్న ఆరోపణలూ ఉన్నాయి.
చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని NCWకి వినతి..
వీడియో లింకులు, ఖాతా వివరాలను మహిళా కమిషన్ సేకరించింది. ఇక, హిందూ దేవతలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినట్లు ఫిర్యాదులు అందాయి. ప్రజా నైతికత, సామాజిక సమతుల్యత దెబ్బతీసే కంటెంట్‌గా కమిషన్ అభిప్రాయపడింది. ఇన్‌ఫ్లుయెన్సర్ అన్వేష్ విదేశాల్లో నివసిస్తున్నట్లు గుర్తించారు. ఈ కేసును జాతీయ మహిళా కమిషన్ (NCW)కు పంపింది తెలంగాణ మహిళా కమిషన్. చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని NCWను కోరింది. మహిళల గౌరవం, సామాజిక విలువల పరిరక్షణే లక్ష్యం అని తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ తేల్చి చెప్పింది.
దేవతలపై నీచపు వ్యాఖ్యలు..
హీరోయిన్ల డ్రెస్సుల గురించి నటుడు శివాజీ చేసిన కామెంట్స్ పై స్పందిస్తూ యూట్యూబర్ అన్వేష్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారమే రేపాయి. బూతులు మాట్లాడుతూ, హిందూ దేవతలపై అతడు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు చిచ్చు రాజేశాయి. దీనిపై తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల కేసులు కూడా నమోదయ్యాయి. ఇక అన్వేష్ ఆచూకీ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. పంజాగుట్ట పోలీసులు. అన్వేష్ యూజర్ ID వివరాలు ఇవ్వాలని ఇన్‌స్టాగ్రామ్ నిర్వాహకులకు లేఖ కూడా రాశారు.
అన్వేష్ ని అరెస్ట్ చేయాలని డిమాండ్..
కొద్దిరోజుల క్రితం సీతమ్మ, ద్రౌపదిపై దారుణమైన కామెంట్లు చేశాడు. దీంతో అతడిపై హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. అన్వేష్ పై కరాటే కళ్యాణి పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. వెంటనే అన్వేష్ ని భారత్ కు రప్పించాలని, అరెస్ట్ చేయాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
Also Read: మీ దగ్గర ఇంకా రూ.2వేల నోటు ఉందా? RBI నుంచి మీకో బిగ్ అలర్ట్..