TGBCL: మద్యం ప్రియులకు గుడ్ న్యూస్.. తెలంగాణలో 121 కొత్త ఫారెన్ బ్రాండ్లు.. ఆబ్కారీ భవన్ కీలక ప్రకటన
ప్రపంచ ప్రఖ్యాత గ్లెన్ఫెడిక్, ది మెకాలన్ సింగిల్ మాల్ట్ విస్కీలు(TGBCL), లూయిస్ థర్టిన్ కాగ్నాక్ లు, సరికొత్త ఫ్లేవర్ల విదేశీ బీర్లు, వైన్లు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి.
- V Santhosh Kumar
- Updated on- August 24, 2026 / 08:51 AM IST
Telangana tgbcl approves 121 new foreign and premium liquor brands
- 121 రకాల నూతన లిక్కర్ బ్రాండ్లు
- గ్లెన్ఫెడిక్, విదేశీ బీర్లు, వైన్ల జోరు
- దరఖాస్తుల అభ్యంతరాలకు ఆఖరి అవకాశం
TGBCL: తెలంగాణలోని మద్యం ప్రియులకు కిక్కు ఇచ్చేందుకు అంతర్జాతీయ, దేశీయ ప్రీమియం బ్రాండ్లు విపణిలోకి క్యూ కడుతున్నాయి. ప్రపంచ ప్రఖ్యాత గ్లెన్ఫెడిక్, ది మెకాలన్ సింగిల్ మాల్ట్ విస్కీలు, లూయిస్ థర్టిన్ కాగ్నాక్ లు, సరికొత్త ఫ్లేవర్ల విదేశీ బీర్లు, వైన్లు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. నూతనంగా 18 ప్రముఖ మద్యం సరఫరా సంస్థలకు చెందిన 121 రకాల నూతన లిక్కర్ బ్రాండ్లను రాష్ట్రంలో ప్రవేశపెట్టేందుకు తెలంగాణ రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీజీబీసీఎల్) రంగం సిద్ధం చేసింది.
Konda Surekha: ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేతో సురేఖ కీలక భేటీ.. అధిష్ఠానానికి వివరణ ఇచ్చిన మంత్రి
పారదర్శకత కోసం వెబ్‌సైట్‌లో వివరాలు:
మద్యం సరఫరా(TGBCL)లో పారదర్శకతను పెంచేందుకు ఈ మొత్తం 121 బ్రాండ్ల వివరాలు, సదరు కంపెనీలు సమర్పించిన పత్రాలను కార్పొరేషన్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు టీజీబీసీఎల్ మేనేజింగ్ డైరెక్టర్ సి.హరి కిరణ్ వెల్లడించారు. మార్కెట్లో ఇప్పటికే ఉన్న ఉత్పత్తులతో పాటు గ్లోబల్ బ్రాండ్లను తెలంగాణ వినియోగదారులకు చేరువ చేయడమే లక్ష్యంగా ఈ ప్రక్రియ సాగుతోంది. ట్రేడ్‌మార్క్ వివాదాలు తలెత్తకుండా జారీ చేసిన ఈ పబ్లిక్ నోటీసుపై సెప్టెంబర్ 1వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు నాంపల్లి అబ్కారీ భవన్‌లో అభ్యంతరాలను సమర్పించవచ్చని తెలిపారు.
లగ్జరీ విదేశీ విస్కీలతో పాటు దేశీయ వైన్లు, బీర్లు:
కొత్తగా అనుమతులు కోరుతున్న జాబితాలో 12, 15, 18, 21 ఏళ్ల నాటి సింగిల్ మాల్ట్ విస్కీలు, మంకీ షోల్డర్, హెండ్రిక్స్ జిన్, టైగర్ లాగర్ బీర్లతో పాటు కొరియన్, జర్మన్ బ్రాండ్లు ప్రధాన ఆకర్షణగా ఉన్నాయి. అంతర్జాతీయ ఉత్పత్తులతో పాటే దేశీయంగా తయారయ్యే ఆర్థోస్ కలెక్టివ్ మాల్ట్ విస్కీ, స్మోక్ ల్యాబ్ వోడ్కా, శంకర్ డిస్టిలర్స్ వర్చాస్ అమెరికన్ విస్కీ, రీకో, వల్లోన్ కంపెనీల ఫ్లేవర్డ్ వైన్లు కూడా తెలంగాణ విపణిలోకి అడుగుపెట్టేందుకు అనుమతుల కోసం ఎదురుచూస్తున్నాయి.
