×
Ad

Saree Distribution: చీరల పంపిణీపై గుడ్‌న్యూస్‌ చెప్పిన మంత్రి సీతక్క.. వాళ్లందరికీ ఆ రోజున..

సిరిసిల్లలో కార్మికులు, ఆసాములతో సీతక్క మాట్లాడారు. చీరల తయారీతో పాటు వారికి వస్తున్న ఆదాయానికి సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు.

Representative image

Saree Distribution: స్వయం సహాయక సంఘాల సభ్యులకు నవంబరు 19న తెలంగాణ ప్రభుత్వం చీరలు పంపిణీ చేయనుందని మంత్రి సీతక్క తెలిపారు. ఆ రోజున ఇందిరా గాంధీ జయంతి ఉండడంతో కాంగ్రెస్‌ సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. ఇందిరా మహిళా శక్తి సంఘాల పేరుతో ఒక్కో ఆయా మహిళలకు ఏడాదికి రెండు చొప్పున చీరలు పంపిణీ చేస్తారు.

తాజాగా సిరిసిల్లలో కార్మికులు, ఆసాములతో సీతక్క మాట్లాడారు. చీరల తయారీతో పాటు వారికి వస్తున్న ఆదాయానికి సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. ఇక్కడ చేనేత కార్మికులకు 365 రోజుల చొప్పున పని కల్పించడానికి తాము మరిన్ని ఆర్డర్లు ఇస్తామని చెప్పారు. వీటిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చిస్తామని అన్నారు. (Saree Distribution)

Also Read: అదృష్టం అంటే నీదే భయ్యా.. చిన్న ఉద్యోగం చేసుకునే ఇతడికి ఎన్ని కోట్ల రూపాయల లాటరీ వచ్చిందంటే?

ఇందిరమ్మ చీరల 2వ ఆర్డర్ అంశాన్ని కూడా రేవంత్‌ రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని సీతక్క తెలిపారు. చీరల తయారీ కోసం సర్కారు ఇస్తున్న ఆర్డర్ల వల్ల నేత కార్మికుడు నెలకు రూ.25 వేలు చొప్పున సంపాదిస్తున్నారని అన్నారు.

మరోవైపు, తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలుకు తమ సర్కారు చిత్తశుద్ధితో ఉందని సీతక్క చెప్పారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ వస్తే కొంతమంది కోర్టులను ఆశ్రయించారని అన్నారు. ఎన్నికల నిర్వహణకు హైకోర్టు నుంచి గ్రీన్‌సిగ్నల్ వస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు.