TS RTC : ఆర్టీసీకి రవాణా శాఖ షాక్..తగ్గిపోనున్న బస్సుల సంఖ్య

ఆర్టీసీకి రవాణా శాఖ షాక్ ఇచ్చింది. దీంతో ప్రస్తుతం ప్రజలకు అందుబాటులో ఉన్న బస్సుల సంఖ్య మరింతగా తగ్గిపోనుంది.

TS RTC  transport department notice to TS RTC for old buses : తెలంగాణ RTC ఇప్పటికే నష్టాల్లో కూరుకుపోయింది. టిక్కెట్ చార్జీల ధరలు పెంచినా ఏమాత్రం అదే పరిస్థితి.చిల్లర సమస్య లేకుండా ధరలు రౌండప్‌ చేసినా ఏదో నెట్టుకొస్తున్నట్లుగా ఉంది పరిస్థితి. ఈ క్రమంలో అసలే నష్టాల్లో ఉన్న తెలంగాణ ఆర్టీకి తెలంగాణ రవాణా శాఖ షాక్ ఇచ్చింది. దీంతో.. బస్సుల సంఖ్య మరంత తగ్గిపోనుంది..ఇప్పటికే సర్వీసులు లేకుండాపలు బస్సులు మూలన పడి ఉన్నాయి.అతి తక్కువ సంఖ్యలో బస్సులు తిరుగుతున్నాయి. ఈక్రమంలో తెలంగాణ రవాణా శాఖ ఆర్టీకి ఇచ్చిన షాక్ తో బస్సుల సంఖ్య మరింత తగ్గిపోనుంది. ఇంతకీ ఆ షాక్ ఏంటీ అంటే..

నిబంధనల ప్రకారం 15 ఏళ్లు దాటిన బస్సులను నడపొద్దంటూ రవాణా శాఖ ఇచ్చిన నోటీస్‌లతో బస్సుల సంఖ్య భారీగా తగ్గిపోనుంది. గత ఏడాది లెక్కల ప్రకారం 97 డిపోల పరిధిలో 9,708 బస్సులు తిరిగాయి. ఇందులో 3,107 అద్దె బస్సులున్నాయి. కాలంచెల్లినందున సంస్థ సొంత బస్సుల్లో కాలంచెల్లిన 600 బస్సులను పక్కనబెట్టనున్నారు. వాటి స్థానంలో 500 ఎలక్ట్రికల్ బస్సులను అద్దె ప్రాతిపదికన తీసుకోవాలని ఆర్టీసీ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం.

కాగా..TS RTC టికెట్ల ధరల్లో స్పల్ప మార్పులు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. పల్లెవెలుగు టికెట్ల చార్జీలు రౌండప్‌ చేసింది ఆర్టీసీ. చిల్లర సమస్య లేకుండా ధరలు రౌండప్‌ చేసినట్లు అధికారులు తెలిపారు. రూ.12 ఛార్జీ ఉన్న చోట టికెట్‌ ధర రూ.10గా రౌండప్‌ చేసింది ఆర్టీసీ. రూ.13, రూ.14 ఉన్న టికెట్‌ ఛార్జీని రూ.15గా ఫైనల్ చేశారు. 80 కిలోమీటర్ల దూరానికి రూ.67 ఉన్న ఛార్జీని రూ.65గా ఆర్టీసీ నిర్ధారించింది. టోల్‌ప్లాజాల వద్ద ఆర్డినరీ బస్సులో అయితే రూ.1, హైటెక్, ఏసీ బస్సులకు రూ.2 అదనంగా ప్రయాణీకుల నుంచి వసూలు చేయనున్నారు. సవరించిన ధరలు తక్షణమే అమల్లోకి వస్తాయని TSRTC ప్రకటించింది. కరోనా లాక్‌డౌన్, ఒమిక్రాన్ వ్యాప్తి వల్ల నష్టాల్లో కూరుకుపోయిన తెలంగాణ ఆర్టీసీని గాడిన పెట్టేందుకు ఎండీ సజ్జనార్ తన మార్క్ వేలో ముందకు వెళ్తున్నారు. ఓవైపు ఆఫర్లు, ఫ్యాకేజీలతో ప్రయాణికులను ఆకర్షిస్తూ.. మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ.. టీఎస్‌ఆర్టీసీ ముందుకు తీసుకెళ్తే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో మూలిగే నక్కమీద తాటిపండు పడినట్లుగా అయ్యింది రవాణా శాఖ తెలంగాణ ఆర్టీకి ఇచ్చిన షాక్..

ట్రెండింగ్ వార్తలు