Janasena ‘Varahi’ : పవన్ కల్యాణ్ ఎన్నికల వాహనం ‘వారాహి’ రిజిస్ట్రేషన్‌కు అనుమతి..

పవన్ కల్యాణ్ ఎన్నికల వాహనం ‘వారాహి’కి వాహనం రిజిస్ట్రేషన్‌కు అనుమతి లభించింది.

Janasena ‘Varahi’ : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల వాహనం ‘వారాహి’కి  రిజిస్ట్రేషన్‍కు లైన్ క్లియర్ అయ్యింది. వారాహి వాహనం రిజిస్ట్రేషన్ కు అనుమతి లభించింది. వారాహి వాహనం ఆర్మీ రంగులో ఉంది ఈ వాహనం రిజస్ట్రేషన్ కు రవాణాశాఖ అనుమతి ఉంటుందో ఉండదో..ఇదేమీ సినిమా కాదు ఇష్టమొచ్చిన వాహనాలు ఉపయోగించటానికి..పవన్ రీల్ లైఫ్ అనుకుంటున్నారేమో..ఇది రియల్ లైఫ్ అని తెలుసుకోవాలి..ఇటువంటి రంగు వాహనంతో పవన్ సినిమా స్టైల్లో ప్రచారాలు చేద్దామనుకుంటే కుదరదు ఇది పవన్ తెలుసుకోవాలి అంటూ వైసీపీ నేతలు పలు విమర్శలు సంధించిన విషయం తెలిసిందే. ఈ విమర్శలకు చెక్ పెడుతూ..తెలంగాణ రవాణా శాఖ వారాహి వాహనం రిజస్ట్రేషన్ కు అనుమతి ఇచ్చింది.

వైసీపీ నేతల విమర్శలకు జనసేన కౌంటర్ కూడా ఇచ్చింది. ఈ విమర్శలపై పవన్ కల్యాణ్ కూడా తనదైన శైలిలో వైసీపీ నేతలకు కౌంటర్ ఇచ్చారు. ఈ క్రమంలో వారాహి వాహనం రంగుపై ఎటువంటి అభ్యంతరం లేదంటూ తెలంగాణ రవాణా శాఖ స్పష్టం చేసింది. రిజిస్ట్రేషన్ కు అనుమతి ఇచ్చింది. మరి ఇప్పుడు వైసీపీ నేతలు ఏమంటారో వేచి చూడాలి..ఇప్పటికే వారాహి వాహనం రంగుపై పలు విమర్శలు చేసిన వైసీపీ నేతలు అసలు స్పందిస్తారో లేదో కూడా వేచి చూడాలి..

కాగా ఎన్నికల ప్రచారం కోసం జనసేన అధినేత పవన్ కల్యాణ్ వినూత్న రీతిలో వాహనాన్ని సిద్ధం చేసుకున్నారు. ఆ వాహనానికి ‘వారాహి’ అని పేరు పెట్టారు. ఈ వాహనంతో ఓ వీడియో కూడా షూట్ చేసి ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. అంతే ఇక వైసీపీ నేతలు విమర్శలతో విరుచుకుపడ్డారు. పవన్ పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇది సినిమా కాదు డబ్బులున్నాయి కదాని ఇష్టమొచ్చిన వాహనం కొనేసుకుని ఇష్టమైన రంగు వేసుకుని తిరిగేయటానికి..అంటూ వైసీపీ నేతలకు ఉన్న అవగాహనతో తమైనశైలిలో విమర్శలు సంధించారు.

వీటిపై జనసేన నేత నాదెండ్ల మనోహర్ స్పందిస్తు వారాహి వాహనం గురించి విమర్శలు చేసే అర్హత వైసీపీకి లేదని..రంగుల రాజకీయాలు చేసిన వైసీపీకి వారాహి గురించి జనసేన గురించి మాట్లాడే అర్హత లేదంటూ కౌంటర్ ఇచ్చారు. అలాగే పవన్ కూడా తనదైన శైలిలో స్పందిస్తు వారాహి వాహనం కలర్ లోనే ఉణ్న ఓ షర్టును పోస్టు చేస్తూ..ఈ షర్టు ధరిస్తే వైసీపీకి అభ్యంతరం ఉందా? అంటూ చురకలు వేశారు. ఈక్రమంలో వారాహి వాహనం రంగుపై విమర్శలకు చెక్ పెడుతూ తెలంగాణ రవాణా శాఖ వారాహి వాహనం రిజస్ట్రేషన్ కు అనుమతి ఇచ్చింది.

 

ట్రెండింగ్ వార్తలు