పాటలు పాడుతూ పోలీస్ ట్రైనింగ్ ఇస్తున్న అధికారి..ఎంజాయ్ చేస్తున్న ట్రైనీ పోలీసులు

  • Publish Date - June 17, 2020 / 07:48 AM IST

పోలీస్‌ ట్రైనింగ్‌లో ఎంతో కఠినంగా ఉంటుంది. కానీ ఓ పోలీస్ అధికారి  ఓ మాదిరివాళ్లు తట్టుకోలేరు. రోజుకు 18 గంటల పాటు ట్రైనింగ్‌ సెషన్స్‌ మాటలు కాదు. ఒళ్లు హూనమైపోతుంది. కానీ ఆడుతు పాడుతూ పనిచేస్తుంటే అలుపుసొలుపేమున్నది అన్నట్లుగా…ఓ పోలీస్ అధికారి ట్రైనీ పోలీసులకు ఇస్తున్న ట్రైనింగ్ మాత్రం చాలా చాలా జోవియల్ గా..సరదా సరదాగా..సాగిపోతోంది. చక్కగా సినిమా పాటలు పాడుతూ ట్రైనీ పోలీసుల్లో ఉత్సాహాన్ని నింపుతూ..ట్రైనింగ్ సెషన్స్ లో చక్కటి ఉత్తేజాన్ని నింపుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

తెలంగాణ స్టేట్‌ స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌లో ట్రైనీ పోలీసులకు శిక్షణ ఇస్తున్న అసిస్టెంట్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.(వైరల్‌: వీళ్లు మనసు దోచుకున్న దొంగలు!

వివరాల్లోకి వెళితే..మహ్మద్‌ రఫీ.. తెలంగాణ పోలీసుశాఖలో అసిస్టెంట్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్నారు. ప్రస్తుతం స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌లో పనిచేస్తున్న   రఫీ ట్రైనీ పోలీసులకు శిక్షణ ఇస్తున్నారు. రఫీకి మంచి మంచి టేస్టులుఉన్నాయి. బాలీవుడ్‌ లెజెండరీ సింగర్‌ మహ్మద్‌ రఫీ పాటలంటే ప్రాణం పెడతారు రఫీ. ట్రైనీ పోలీసులకు శిక్షణ కఠినంగా అనిపించకుండా ఉండేదుకు తన అభిమాన సింగర్ మహ్మద్ రఫీ పాటలు పాడుతూ  ట్రైనింగ్ ఇస్తున్నారు.

1970లో వచ్చిన హమ్‌జోలీ సినిమాలో మహ్మద్ రఫీ పాడిన ‘దల్‌ గయా దిన్‌.. హో గయి శామ్‌’ పాటను పాడుతూనే ట్రైనింగ్ ఇస్తున్నారు.  ట్రైనీ పోలీసులు  కూడా రఫీ పాటలను ఎంజాయ్ చేస్తు చక్కగా అలుపు సొలుపు లేకుండా శిక్షణ తీసుకుంటున్నారు.

ఈ వీడియోనూ ఇండియన్‌ పోలీస్‌ సర్వీస్‌ అసోసియేషన్‌ తన ట్విటర్‌లో షేర్‌ చేస్తూ..’  ఇవి శిక్షణకు కోసం ఆ రఫీ పాడిని మా రఫీ పాటలు.. ఒకరేమో పోలీస్‌.. మరొకరేమో లెజండరీ సింగర్‌..ఇద్దరు పేర్లు కామన్‌గా ఉన్నా.. మా రఫీ కూడా పాటలు చాలా బాగా పాడుతాడు. ట్రైనీ పోలీసులకు శిక్షణ అందిస్తూనే వారికి ఇంటి బెంగను..శారీరక శ్రమను మరిచిపోయేలా చేస్తున్నాడు.. నిజంగా ఇది అతనికున్న గొప్ప అభిరుచి’ అంటూ క్యాప్షన్‌ కూడా పెట్టారు.  ఈ వీడియో ప్రస్తుతం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటూ వైరల్ గా మారింది.

Read:  కల్నల్ సంతోష్కు 9 ఏళ్ల కుమార్తె నివాళి..కంటతడిపెట్టిస్తున్న చిన్నారి ఫోటో