Telangana University : లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయిన తెలంగాణ వర్సిటీ వీసీ రవీందర్ గుప్తా

ఏసీబీ అధికారులు రవీందర్ గుప్తాను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడానికి వల పన్నారు.

Telangana University VC Ravinder Gupta

Telangana University – VC : లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయారు తెలంగాణ వర్సిటీ వీసీ రవీందర్ గుప్తా ( Ravinder Gupta). భీమ్ గల్ లో ఉన్న ఒక కళాశాలకు పరీక్ష కేంద్రం అనుమతి కోసం రూ.50 వేలు లంచం డిమాండ్ చేశారు రవీందర్. దీంతో ఆ కళాశాలకు చెందిన శంకర్ ఏసీబీ(ACB)ని ఆశ్రయించారు.

ఏసీబీ అధికారులు రవీందర్ గుప్తాను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడానికి వల పన్నారు. ముందస్తు చర్యలు తీసుకున్నారు. లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా చిక్కారు. రవీందర్ గుప్తాను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పుడు తెలంగాణ వర్సిటీలోనూ ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది. 10 టీవీతో ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ మాట్లాడారు.

వీసీ ఆయన ఇంట్లోనే రూ.50 వేలు లంచం తీసుకుంటూ దొరికారని అన్నారు. గతంలో ఆయనపై వచ్చిన ఫిర్యాదులపై కూడా విజిలెన్స్ దర్యాప్తు జరుగుతోందని తెలిపారు. తాము ఆయన నివాసంతో పాటు యూనివర్సిటీలో కూడా సోదాలు చేస్తున్నామని చెప్పారు. సోదాలు పూర్తి అయిన తర్వాత ఆరెస్ట్ చేసి రిమాండ్ కు తరలిస్తామని తెలిపారు.

Sharad Pawar- KCR: మహారాష్ట్రలో దూకుడు పెంచిన బీఆర్ఎస్.. కేసీఆర్‌పై శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు