Telangana (2)
Telangana : ఈ నెల 15వ తేదీన టీఆర్ఎస్ పార్టీ తలపెట్టిన తెలంగాణ విజయ గర్జన సభ వాయిదా పడింది. తెలంగాణ దీక్షా దివస్ అయిన నవంబర్ 29వ తేదీన ఈ సభను నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు.
చదవండి : Telangana : అప్పుడే చలి..పడిపోతున్న ఉష్ణోగ్రతలు
సోమవారం ఉమ్మడి వరంగల్ జిల్లా టీఆర్ఎస్ నేతలు, మంత్రలు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, చీఫ్ విప్ వినయ్ భాస్కర్, వరంగల్ ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు నన్నపునేని నరేందర్, ఆరూరి రమేష్, పెద్ది సుదర్శన్ రెడ్డి, ధర్మారెడ్డి తదితర పార్టీ ముఖ్య నేతలు సభను 29 నిర్వహించాలని ముఖ్యమంత్రి అభ్యర్థించారు. దీంతో సభను 29 నే నిర్వహించాలని సీఎం నిర్ణయించారు.
చదవండి : Telangana : అల్పపీడనం ఎఫెక్ట్.. మూడు రోజులు వర్షాలు
తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ నవంబర్ 29వ తేదీన ఆమరణ నిరాహార దీక్షకు దిగిన విషయం తెలిసిందే. తెలంగాణ ఏర్పాటు తరువాత నవంబర్ 29ని దీక్షా దివస్‌గా ప్రకటించారు. ఆ తేదీయే తెలంగాణ విజయ గర్జన సభ నిర్వహణకు తగిన సమయం, సందర్భం అని నేతలు అభిప్రాయడ్డారు.