Telangana : అప్పుడే చలి..పడిపోతున్న ఉష్ణోగ్రతలు

గత మూడు రోజుల నుంచి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. రాత్రి వేళ చల్లటి గాలులు వీస్తుండడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు జంకుతున్నారు.

Telangana : అప్పుడే చలి..పడిపోతున్న ఉష్ణోగ్రతలు

Tg Weather

Severe Cold Wave In Telangana : తెలంగాణ రాష్ట్రంలో వాతావరణం మారిపోతోంది. వాతావరణ పూర్తిగా చలబడింది. గత మూడు రోజుల నుంచి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. రాత్రి వేళ చల్లటి గాలులు వీస్తుండడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. రాత్రి వేళ విపరీతంగా చలి ఉంటోంది. కొన్ని జిల్లాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు అమాంతం పడిపోయాయి.

Read More : Telangana : అల్పపీడనం ఎఫెక్ట్.. మూడు రోజులు వర్షాలు

12 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయ్యాయి. ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ లో అత్యల్పంగా…12.6 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. ఆదిలాబాద్ తో పాటు..ఇతర జిల్లాల్లో సైతం చలి వణికిస్తోంది. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పడిపోయే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. బజర్హత్నూర్ లలో 12.6 డిగ్రీలు, కేరమేరిలో 12.9 డిగ్రీలు, పొచర, తలమడుగులో 13, సిర్పూర్ లో 13.1, థాంసీలలో 13.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Read More : Drunken Headmaster : మందుకొట్టి విద్యార్ధినులతో డ్యాన్స్ చేయించిన హెడ్‌మాస్టర్

మరోవైపు… తెలంగాణా రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు, కొన్ని చోట్ల మంగళవారం, బుధవారం వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. సోమవారం, మంగళవారం రోజుల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని అధికారులు వెల్లడించారు. రాగల 3 రోజులు ఉరుములు మెరుపులతో కొన్ని జిల్లాలలో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయన్నారు. అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కూడా సగటు సముద్ర మట్టానికి సుమారు 3.1 కి మి ఎత్తు వరకు వ్యాపించి ఉందని, ఆగ్నేయ అరేబియా సముద్రంలోకి వెళ్ళి బలపడే అవకాశం ఉందన్నారు. ఈ అల్పపీడనం తెలంగాణా నుంచి దూరంగా వెళ్ళిపోయే అవకాశం ఉందన్నారు.