Weather Updates: అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ కుమ్మేయనున్న భారీ వర్షాలు
ఏపీలోని పలు జిల్లాల్లో ఇప్పటికే కురిసిన వర్షాలకు లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి.

Heavy Rains
Weather Updates: తెలుగు రాష్ట్రాలను భారీ వర్షాలు మళ్లీ కుమ్మేయనున్నాయి. రానున్న 48 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశముంది.
వాతావరణ శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, కడప జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. (Weather Updates)
ఏపీలోని పలు జిల్లాల్లో ఇప్పటికే కురిసిన వర్షాలకు లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి. అనంతపురంతో పాటు ఉమ్మడి కర్నూలు జిల్లాలోని పలు ప్రాంతాల్లో నిన్న, మొన్న భారీ వర్షాలు కురిశాయి. వాగులు, వంకలు పొంగిపొర్లాయి. కొన్ని నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. కొన్ని గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
తెలంగాణలోని నిర్మల్, నిజామాబాద్, హైదరాబాద్, మేడ్చల్, మహబూబ్ నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, మహబూబాబాద్, సూర్యాపేట, జగిత్యాల, వికారాబాద్, కామారెడ్డి, గద్వాల్, నల్లగొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయి.
హైదరాబాద్‌లో నిన్న సాయంత్రం కుండపోత వర్షం కురిసింది. దీంతో కొన్ని నిమిషాల్లోనే రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్లే వారు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. రోడ్లపై మోకాళ్ల లోతు నీరు చేరింది. విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.