Best Android Phones : ఐఫోన్ 17 ప్రో మాక్స్‌ కన్నా 6 బెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు ఇవే.. ఏ ఫోన్ కొంటారో మీ ఇష్టం..!

Best Android Phones : అంత ఖరీదైన ఆపిల్ ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ కొనడం ఎందుకు? అంతే స్థాయి ఫీచర్లతో 6 ఆండ్రాయిడ్ ఫోన్లు మార్కెట్లో లభ్యమవుతున్నాయి.. ఓసారి లుక్కేయండి..

1/7Best Android Phones
Best Android Phones : కొత్త ఆపిల్ ఐఫోన్ 17 కోసం చూస్తున్నారా? ఆపిల్ ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ కన్నా బెటర్ ఫీచర్లతో ఆండ్రాయిడ్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. మీరు కొత్త ఐఫోన్ కొనే బదులుగా ఆండ్రాయిడ్ ఫోన్ ఇంటికి తెచ్చుకోవచ్చు. ఫ్లాగ్‌షిప్ పర్ఫార్మెన్స్, ఫీచర్లతో ఐఫోన్ కన్నా ఏమాత్రం తగ్గని 6 అద్భుతమైన ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్లు లభ్యమవుతున్నాయి. ఆపిల్ ప్రీమియం ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్‌తో పోటీపడేలా అల్ట్రా-ఫాస్ట్ ప్రాసెసర్లు, అడ్వాన్స్ ఫొటోగ్రఫీ సిస్టమ్‌లు అత్యంత ఆకర్షణీయంగా ఉన్నాయి. ఆపిల్ ఎకో సిస్టమ్ కన్నా హై లెవల్ క్వాలిటీ, పర్ఫార్మెన్స్ కోరుకునే కస్టమర్లకు ఈ 6 ఆండ్రాయిడ్ ఫోన్లు బెటర్ ఆప్షన్ అని చెప్పొచ్చు.
2/7samsung galaxy s25 ultra
శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా (రూ. 1,07,999) : శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్‌పై 6.9-అంగుళాల డైనమిక్ LTPO అమోల్డ్ 2X ప్యానెల్‌తో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్‌ను అందిస్తుంది. క్వాడ్ 200MP+10MP+50MP+50MP మెయిన్ కెమెరా సెటప్, 12MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 45W ఛార్జింగ్‌కు సపోర్టు ఇచ్చే 5000mAh బ్యాటరీ కలిగి ఉంది. ఐఫోన్ 17 ప్రో మాక్స్‌కు గట్టి పోటీదారుగా నిలిచింది.
3/7Xiaomi 15 Ultra
షావోమీ 15 అల్ట్రా (రూ. 1,09,999) : షావోమీ 15 అల్ట్రా ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.73-అంగుళాల అమోల్డ్ ప్యానెల్‌ కలిగి ఉంది. స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్‌పై రన్ అవుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 90W టర్బో ఛార్జింగ్‌కు సపోర్టు ఇచ్చే 5410mAh బ్యాటరీ, క్వాడ్ 50MP+200MP+50MP+50MP ప్రైమరీ కెమెరా సిస్టమ్, సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32MP కెమెరాతో వస్తుంది. ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ వంటి ప్రీమియం క్వాలిటీని అందిస్తుంది.
4/7Vivo X200 Pro
వివో X200 ప్రో (రూ. 86,400) : వివో X200 ప్రో ఫోన్ 6.78-అంగుళాల LTPO అమోల్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్‌ అందిస్తుంది. మీడియాటెక్ డైమన్షిటీ 9400 చిప్‌సెట్‌తో పవర్ అందిస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ బ్యాక్ సైడ్ ట్రిపుల్ 50MP+200MP+50MP కెమెరా, 32MP సెల్ఫీ కెమెరా, 90W టర్బో ఛార్జింగ్ సపోర్ట్‌తో 6000mAh బ్యాటరీ కలిగి ఉంది. ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్‌తో పోటీ పడేలా ఫీచర్లు కలిగి ఉంది.
5/7google pixel 10 pro
గూగుల్ పిక్సెల్ 10 ప్రో (రూ. 1,09,999) : ఈ గూగుల్ పిక్సెల్ 10 ప్రో ఫోల్డ్ గూగుల్ టెన్సర్ G5తో 120Hz వద్ద రిఫ్రెషింగ్, 6.3-అంగుళాల సూపర్ యాక్టువా LTPO OLED ప్యానెల్‌ కలిగి ఉంది. ఈ మొబైల్ యూనిట్ 30W ఛార్జింగ్ ద్వారా సపోర్టు అందిస్తుంది. 4870mAh బ్యాటరీ, ట్రిపుల్ 50MP+48MP+48MP మెయిన్ కెమెరా సెటప్, ఫ్రంట్ సైడ్ 42MP కెమెరా కలిగి ఉంది. ఐఫోన్ 17 ప్రో మాక్స్ మాదిరిగా ప్రీమియం ఎక్స్ పీరియన్స్ అందిస్తుంది.
6/7Oppo Find X8 Pro
ఒప్పో ఫైండ్ X8 ప్రో (రూ. 92,999) : ఒప్పో ఫైండ్ X8 ప్రో మోడల్ 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్టు ఇచ్చే 6.78-అంగుళాల LTPO అమోల్డ్ ప్యానెల్ కలిగి ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 9400 ప్రాసెసర్ మరింత పవర్ అందిస్తుంది. క్వాడ్ 50MP ప్రైమరీ కెమెరా సెటప్, 32MP ఫ్రంట్ కెమెరా, 80W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇచ్చే 5910mAh బ్యాటరీతో వస్తుంది. ఐఫోన్ 17 ప్రో మాక్స్ మాదిరిగా అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉంది.
7/7Motorola Razr 60 Ultra
మోటోరోలా రేజర్ 60 అల్ట్రా (రూ. 89,998) : స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్‌పై రన్ అయ్యే మోటోరోలా రేజర్ 60 అల్ట్రా ఫోన్ 165Hz రిఫ్రెష్ రేట్‌తో 7.0-అంగుళాల ఫోల్డబుల్ LTPO అమోల్డ్ డిస్‌ప్లే కలిగి ఉంది. ఈ ఫోన్ 68W ఛార్జింగ్ సపోర్ట్‌తో 4700mAh బ్యాటరీ, 50MP+50MP డ్యూయల్ బ్యాక్ లెన్స్, అద్భుతమైన 50MP సెల్ఫీ కెమెరాను అందిస్తుంది. ఐఫోన్ 17 ప్రో మాక్స్‌కు దగ్గరగా ఫీచర్లతో ఆకట్టుకునేలా ఉంది.