Online Games Cheating..yong Man Commits Suicide
online games cheating..yong man commits suicide : ఆన్ లైన్ గేమ్ మోసానికి జగిత్యాలలో ఓ యువకుడు బలి అయ్యాడు. జగిత్యాల రూరల్ మండలం అంతర్గాంలో కొట్టల తరుణ్ రెడ్డి అనే యువకుడు ఆన్ లైన్ గేమ్ ఆడుతుండగానే అతని బ్యాంక్ ఎకౌంట్ నుంచి కేటుగాళ్లు రూ.1.80లక్షలు మాయం చేశారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురి అయిన తరుణ్ రెడ్డి పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నం చేశాడు.
తరుణ్ అపస్మారస్థితికి వెళ్లిపోవటంతో గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతు మంగళవారం (జులై 12,2022) తెల్లవారుఝామున తరుణ్ మృతి చెందాడు. చేతికి అంది వచ్చిన కొడుకు చనిపోవటంతో కుటుంబ సభ్యులు శోక సముద్రంలో మునిగిపోయారు. అలా మొబైల్ ఫోన్ లో ఆన్ లైన్ గేమ్ మోసానికి తరుణ్ ప్రాణాలు కోల్పోయాడు.
ఇటీవల కాలంలో ఆన్ లైన్ మోసాలు ఎక్కువైపోయాయి. ఏ మాత్రం అజాగ్రత్త వహించినా కూడా లక్షల్లో సొమ్ము మాయం చేస్తున్నారు కేటుగాళ్లు. పోలీసులు ప్రభుత్వం ఈ సైబర్ నేరాలపై ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ కూడా ఇలా మోసపోయేవారి సంఖ్య రోజురోజుకి పెరుగుతూనే ఉంది. మొబైల్ లో ఆన్ లైన్ లో గేమ్ పేరుతో ఎంతోమంది డబ్బులు పోగొట్టుకోవటం ఆత్మహత్యలు చేసుకుని కుటుంబాలను శోక సముద్రంలో ముంచి చనిపోవటంతో జరుగుతోంది. కొంతమంది అయితే ఆన్ లైన్ గేముల కోసం ఇంట్లో డబ్బులను కూడా దొంగిలించటం కూడా జరుగుతోంది. అలా ఆన్ లైన్ గేములు కుటుంబాల్లో చిచ్చులు పెడుతున్నాయి.పలు సందర్భాల్లో ప్రాణాల్ని తీస్తున్నాయి.