4009 New Corona Cases In Telangana
Telangana Corona cases : తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. నిన్న కొత్తగా 4,009 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొన్నటితో పోలిస్తే దాదాపు 1000 కేసులు తగ్గాయి.
రాష్ట్రంలో నిన్న రాత్రి 8 గంటల వరకు 83,089 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా..వారిలో 4,009మందికి కోవిడ్ నిర్ధారణ అయ్యింది. దీంతో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 3,55,433కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ సోమవారం ఉదయం బులిటెన్ విడుదల చేసింది.
రాష్ట్రంలో నిన్న కరోనాతో 14 మంది మరణించారు. దీంతో కరోనాతో ఇప్పటి వరకు మృతిచెందిన వారి సంఖ్య 1,838కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న 1,878 మంది కోలుకున్నారు.రాష్ట్రంలో ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 3,14,441కి చేరింది.
ప్రస్తుతం రాష్ట్రంలో 39,154 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.జీహెచ్‌ఎంసీ పరిధిలో 705,మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 363, నిజామాబాద్‌లో 360, రంగారెడ్డిలో 336, సంగారెడ్డిలో 264 చొప్పున కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో ఇప్పటి వరకు నిర్వహించిన మొత్తం కరోనా పరీక్షల సంఖ్య 1,18,20,842కి చేరింది.
TS Covid Report
Covid Dist Wise Report