Sun
Temperature Increasing : అబ్బా ఏం ఉక్కపోత..అంటున్నారు నగర వాసులు. ఎందుకంటే గత కొన్ని రోజులుగా ఎండలు అధికంగా ఉండడం, రాత్రి వేళ ఉక్కపోత ఉండడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. పగలు, రాత్రి అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగానే..ఈ పరిస్థితి నెలకొందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడిస్తున్నారు. ఉష్ణోగ్రతలు సాధారణం కంటే…మూడు, నాలుగు డిగ్రీల ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. మధ్యాహ్నం వేళ 34 డిగ్రీలు, రాత్రి వేళ కనిష్ట ఉష్ణోగ్రతలు 25 డిగ్రీలు నమోదవుతుండడంతో ఎలాంటి పరిస్థితి నెలకొందో అర్థం చేసుకోవచ్చు.
Read More : Manchu Lakhsmi: మంచు వారమ్మాయా మజాకా.. ఇల్లు చూస్తే ఇంద్ర భవనమే!
జులై నెలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కూడా సాధారణ వర్షపాతం నమోదయ్యింది. కానీ..ఆగస్టు నెల వచ్చే సరికి వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయి. ఫలితంగా అధిక టెంపరేచర్స్ రికార్డవుతున్నాయి. నైరుతి రుతుపవనాల ద్రోణి…హిమాలయాల వైపు మళ్లాయని, ఈ కారణంగా..అక్కడ వర్షాలు పడుతున్నాయని వాతావరణ శాఖాధికారులు వెల్లడిస్తున్నారు. అరేబియా సముద్రంలో అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం, ద్రోణి ఏవీ లేకపోవడం వల్ల…తేమ గాలులు రావడం లేదంటున్నారు.
Read More : Ameesha Patel: ఐదు పదుల చేరువలో అమీషా హద్దులు దాటే అందాలు!
హైదరాబాద్ నగరంలో ఆగస్టు 15వ తేదీ వరకు ఈ ఇలాంటి పరిస్థితి ఉంటుందని, తర్వాత…మూడు రోజులు వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే..ఉక్కపోత ఉండడంతో కరెంటును ఎక్కువగా వాడేస్తున్నారు. ఫ్యాన్లు, కూలర్లను వాడుతున్నారు. దీంతో అనూహ్యంగా విద్యుత్ డిమాండ్ పెరిగింది. ఎండకాలంలో ఒక్కరోజు గరిష్ట వినియోగం 60 మిలియన్ యూనిట్ల లోపు ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం అలాంటి సీన్ ఇప్పుడూ నెలకొంది. వానలు పడకపోతే మాత్రం కరెంటుకు మరింత డిమాండ్ ఏర్పడే అవకాశం ఉందని విద్యుత్ అధికారులు అంచనా వేస్తున్నారు.