Road Accident : ఘోర రోడ్డు ప్రమాదం.. తల్లి సహా కుమారుడు, కుమార్తె దుర్మరణం
పేట్ బషీరాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తల్లి సహా కుమారుడు, కుమార్తె మృతి చెందారు. బైక్‌పై వెళ్తున్న ముగ్గురిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది.
- bheemraj
- Published On : November 10, 2021 / 09:41 PM IST
Accident
three killed in road accident : పేట్ బషీరాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తల్లి సహా కుమారుడు, కుమార్తె మృతి చెందారు. బైక్‌పై వెళ్తున్న ముగ్గురిని దూలపల్లి ఫారెస్ట్ అకాడమీ సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో బైక్‌పై వెళ్తున్న ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతులు తల్లి పైడమ్మ(40), కుమారుడు కాళి కృష్ణ(22), కూతురు శ్రీవల్లి(18)గా గుర్తించారు.
దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని బహదూర్‌పల్లిలోని ఇందిరమ్మ కాలనీలో పైడమ్మ, కాళి కృష్ణ, శ్రీవల్లి నివాసముంటున్నారు. తల్లి, కుమార్తె అపురూప కాలనీలోని ఓ ప్రయివేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. కుమారుడు దూలపల్లిలోని ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నారు. ఇవాళ సాయంత్రం తమ విధులు ముగించుకున్న ఆ ముగ్గురు దూలపల్లి నుంచి ఇందిరమ్మ కాలనీకి బైక్ పై వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
High Court Key Directions : గురజాల, దాచేపల్లి మున్సిపల్ ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు
వీరి మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
