Corona Positive : తెలంగాణలో కరోనా విజృంభణ.. బీఆర్‌కే భవన్‌లో ఐఏఎస్‌లు, ఉద్యోగులు.. పోలీసులకు పాజిటివ్

జీఏడీ ప్రిన్సిపల్‌ సెక్రటరీ పేషీలో ముగ్గురు కరోనా బారిన పడ్డారు. జీఏడీ ప్రిన్సిపల్‌ సెక్రటరీ వికాస్‌ రాజ్‌తో పాటు మరో ఐఏఎస్‌ అధికారి హోం ఐసోలేషన్‌లో ఉన్నారు.

Corona for IAS officers, employees : తెలంగాణలో కరోనా విజృంభిస్తోంది. సామాన్యులు, ప్రభుత్వ ఉద్యోగులు, విఐపీల నుంచి ఫ్రంట్‌లైన్‌ వర్కర్స్‌ వరకు ఎవరినీ వదలడం లేదు. వరుసగా అందరికీ సోకుతోంది. హైదరాబాద్‌ బీఆర్‌ఎకే భవన్‌లో ఐఏఎస్‌ అధికారులతో పాటు ఉద్యోగులకు వైరస్‌ సోకింది. సాధారణ పరిపాలన శాఖ, విద్యాశాఖల్లో 15 మందికి కోవిడ్‌తో బాధపడుతున్నారు.

జీఏడీ ప్రిన్సిపల్‌ సెక్రటరీ పేషీలో ముగ్గురు కరోనా బారిన పడ్డారు. జీఏడీ ప్రిన్సిపల్‌ సెక్రటరీ వికాస్‌ రాజ్‌తో పాటు మరో ఐఏఎస్‌ అధికారి హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. విద్యాశాఖ కార్యదర్శి సందీప్‌ సుల్తానియాకు పాజిటివ్‌ నిర్ధారణ అయింది.

Covid New Guidelines: కొవిడ్ కొత్త మార్గదర్శకాలు.. ఆగకుండా దగ్గు వస్తే టీబీ పరీక్ష చేయించుకోండి

హైదరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలోని సీసీఎస్‌, సైబర్‌ క్రైమ్‌ విభాగాల్లో పనిచేస్తున్న 20మంది కోవిడ్‌ బారిన పడ్డారు. ఓ కేసు దర్యాప్తులో భాగంగా ఇటీవల సైబర్‌ క్రైమ్‌ టీమ్‌ రాజస్తాన్‌ వెళ్లి వచ్చింది. వారిలో ఎస్‌ఐకి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. అతని ద్వారా మిగిలిన వారికి కరోనా సోకింది.

రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీసు స్టేషన్‌లో కూడా 20మంది పోలీసులు కోవిడ్‌ బారినపడ్డారు. బాధితులంతా హోం ఐసోలేషన్‌లో ఉంటున్నారు. పోలీసు స్టేషన్‌లోకి ఎవరినీ అనుమతించడంలేదు. ఫిర్యాదుల కోసం స్టేషన్‌ ముందు టెంట్‌ ఏర్పాటు చేశారు. మాస్క్‌ లేనివారి వెనక్కి పంపుతున్నారు. సామాజిక దూరం పాటించే విధంగా చూస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు