Handloom Loans: చేనేత కార్మికుల రుణమాఫీ పథకానికి సర్కారు పచ్చజెండా

వారికి రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం చాలా కాలంగా చెబుతోంది.

తెలంగాణలో చేనేత కార్మికులకు సీఎం రేవంత్ రెడ్డి సర్కారు గుడ్‌న్యూస్‌ చెప్పింది. రుణమాఫీ పథకానికి పచ్చజెండా ఊపుతూ రూ.33 కోట్ల రుణమాఫీకి ప్రాథమికంగా అనుమతులు జారీ చేసింది. రూ.లక్ష వరకు ఉన్న రుణాలు మాఫీ కానున్నాయి. 2017, ఏప్రిల్‌ 1 – 2024, మార్చి 31 మధ్య ఉన్న రుణాలు మాఫీ చేస్తారు. ఒక్కో చేనేత కార్మికుడికి దీని కింద రూ.లక్ష వరకు రుణమాఫీ జరుగుతుంది.

మరోవైపు, తెలంగాణలో గత బీఆర్ఎస్ సర్కారు చేనేత కార్మికులకు 2017 వరకు రుణమాఫీ చేసిన విషయం తెలిసిందే. జిల్లా సహకార బ్యాంకులతో పాటు జాతీయ బ్యాంకుల్లో దేని నుంచి తీసుకున్నప్పటికీ చేనేత కార్మికులకు అప్పట్లో రుణమాఫీ జరిగింది.

Also Read: ఈ సారి ఎండలు ఎలా ఉండనున్నాయ్‌? వర్షాకాలంలో వానలు ఎంతగా పడబోతున్నాయో తెలుసా?

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వస్త్ర వ్యాపారం పెద్ద ఎత్తున జరుగుతుంది. ఉమ్మడి జిల్లాలో దాదాపు 20,000 మంది చేనేత కార్మికులు ఉంటారు. దాదాపు 40 పైగా సొసైటీలు ఉన్నాయి. కొన్ని ​వేల మంది చేనేత కార్మికులు వాటిల్లో సభ్యులుగా ఉన్నారు.

తెలంగాణ రాష్ట్రం చేనేత పరిశ్రమకు కూడా ప్రసిద్ధి. తక్కువ ఖర్చుతో నాణ్యతతో కూడిన వస్త్రాలను కార్మికులు తయారు చేస్తారు. చేనేత బజార్ చేనేత ఉత్పత్తులకు మార్కెట్ అవకాశాలు కల్పిస్తుంది. చేనేత ఉత్పత్తులు పండుగలు, శుభకార్యాల వేల బాగా వాడుతున్నారు.

తెలంగాణలోని చేనేత కార్మికులకు మొత్తం కలిపి రూ.50 కోట్లకు పైగా రుణాలు ఉన్నట్లు అంచనా. వారికి రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం చాలా కాలంగా చెబుతోంది. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలకు అనుగుణంగా రుణమాఫీ చేసేంందుకు ఇప్పటికే అధికారులు ప్రక్రియను పూర్తి చేసినట్లు తెలుస్తోంది. రుణాల సమాచారాన్ని అధికారులు సేకరించారు.