Telangana Govt : నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త.. టీజీపీఎస్‌సీ కీలక ప్రకటన .. వరుస నోటిఫికేషన్లు

Telangana Govt TGPSC Job Notifications : వచ్చే వారం నుంచి వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి వరుసగా నోటిఫికేషన్లు జారీ చేయడం జరుగుతుందని టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం వెల్లడించారు.

TGPSC Job Notifications

Telangana Govt TGPSC Job Notifications : తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ శాఖల్లోని ఖాళీలను భర్తీ చేసేందుకు నిర్ణయించింది. ఇందులో భాగంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్‌సీ) వరుస నోటిఫికేషన్లు విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే పలు శాఖల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీకాగా.. ఇకనుంచి వరుసగా నోటిఫికేషన్లు జారీ చేసేందుకు చర్యలు ప్రారంభించింది.

Also Read : Telangana Govt : రైతులకు బిగ్ షాకిచ్చిన తెలంగాణ సర్కార్.. ఆ పథకం బంద్.. ఆందోళనలో అన్నదాతలు..

వచ్చే వారం నుంచి వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి వరుసగా నోటిఫికేషన్లు జారీ చేయడం జరుగుతుందని టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం వెల్లడించారు. అభ్యర్థుల్లో నమ్మకాన్ని పెంపొందించేలా పరీక్షల నిర్వహణ, మూల్యాంకనం, ఫలితాల వెల్లడిలో పారదర్శకత, ఖచ్చితత్వం, జవాబుదారీతనానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తామని ఆయన స్పష్టం చేశారు.

పంద్రాగస్టు వేడుకల సందర్భంగా టీజీపీఎస్సీ కార్యాలయంలో బుర్రా వెంకటేశం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాల భర్తీపై కీలక ప్రకటన చేశారు. టీజీపీఎస్సీ రాజ్యాంగ బద్ధమైన సంస్థ. ఏమాత్రం పొరపాటు జరిగినా అభ్యర్థులపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఉద్యోగులందరూ ప్రతి దశలో అత్యంత అప్రమత్తంగా పనిచేయాలి. నియామక ప్రక్రియలో సాంకేతికత మరింత పెరగాల్సిన అవసరముందని అన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి వచ్చే వారం నుంచి వరుస నోటిఫికేషన్లు జారీ చేయడం జరుగుతుందని, అభ్యర్థుల విశ్వాసాన్ని పెంపొందించేలా, పారదర్శకత, కచ్చితత్వం, జవాబుదారీతనంతో పరీక్షలు నిర్వహించి నియామకాలు పూర్తి చేస్తామని చెప్పారు.

మరోవైపు.. ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాల భర్తీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిసైతం కీలక ప్రకటన చేశారు. సంగారెడ్డి జరిగిన కార్యక్రమంలో రేవంత్ మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే సుమారు 70వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామని, ఇటీవల మరో 10వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేసినట్లు తెలిపారు. ప్రభుత్వ శాఖల్లో ఏర్పడే ఉద్యోగా ఖాళీలను గుర్తించి ఆరు నెలలకు ఒకసారి పోటీ పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు. ఉద్యోగాల భర్తీ బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని, ఏ ఖాళీని నిర్లక్ష్యం చేయబోమని ఆయన స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, టీజీపీఎస్సీ చైర్మన్ తాజా ప్రకటనలతో నిరుద్యోగ యువతలో ఆశలు పెరుగుతున్నాయి.