TGSRTC
ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ భారీ షాక్ ఇచ్చింది. టీజీఎస్ ఆర్టీసీ బస్ పాస్ ఛార్జీలను 20 శాతం మేర పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పెంపు సాధారణ ప్రజలతో పాటు విద్యార్థులపై కూడా ప్రభావం చూపనుంది. ఈ కొత్త ఛార్జీలు ఈరోజు నుంచే అమల్లోకి వస్తాయని ఆర్టీసీ వెల్లడించింది.
పెరిగిన ఛార్జీలు ఇలా..
Also Read: తన 11 ఏళ్ల పాలనపై ప్రధాని మోదీ ఆసక్తికర కామెంట్స్
ఇప్పటికే హైదరాబాద్ మెట్రో రైల్‌లో కూడా టికెట్ల ధరలను పెంచారు. ఇప్పుడు ఆర్టీసీ ఛార్జీలు కూడా పెంచడంతో నగరవాసులపై భారం పడుతోంది. తెలంగాణ ప్రభుత్వం మహిళల కోసం ‘మహాలక్ష్మి’ ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని అమలు చేస్తోంది. దీని వల్ల ఆర్టీసీకి భారీగా నష్టాలు వస్తున్నాయని ప్రతిపక్షాలు అంటున్నాయి.
సంస్థ జీతాలు కూడా ఇవ్వలేని స్థితిలో ఉందని విమర్శలు వస్తున్నాయి. తమ జీతభత్యాలు పెంచాలని డిమాండ్ చేస్తూ గత నెలలో ఆర్టీసీ కార్మికులు సమ్మెకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అయితే ప్రభుత్వం కార్మిక నేతలతో చర్చలు జరిపిన తర్వాత, వారు తాత్కాలికంగా సమ్మెను వాయిదా వేశారు.