RTC Buses: ఉగాది, రంజాన్ పండుగల వేళ.. ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్‌న్యూస్

ఇక, మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ఉచిత ప్రయాణం యథావిధిగా అమలు కానుంది.

  • Published On : March 16, 2026 / 04:27 PM IST
  • ఉగాది, రంజాన్ పండుగల కోసం ప్రత్యేక బస్సులు
  • మార్చి 17, 18 తేదీల్లో అదనపు సర్వీసులు
  • తిరుగు ప్రయాణ రద్దీకి మార్చి 23న ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు
  • అదనపు బస్సుల్లో స్పెషల్ చార్జీలు

RTC Buses: పండుగల వేళ ప్రయాణికులకు టీజీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. ఉగాది, రంజాన్ పండుగల కోసం ప్రత్యేక బస్సులు నడపనుంది. మార్చి 17, 18 తేదీల్లో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా అదనపు సర్వీసులు నడపనుంది. తిరుగు ప్రయాణ రద్దీకి మార్చి 23న ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. కాగా, స్పెషల్ బస్సుల్లో మాత్రమే 1.5 రెట్ల వరకు చార్జీల సవరణ ఉండనుంది. రెగ్యులర్ బస్సుల్లో మాత్రం సాధారణ చార్జీలే కొనసాగించనుంది. ఇక, మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ఉచిత ప్రయాణం యథావిధిగా అమలు కానుంది.

ఉగాది తెలుగు ప్రజలు జరుపుకునే పెద్ద పండుగ. రంజాన్ ముస్లింలు జరుపుకునే ముఖ్యమైన పండగ. ప్రధానమైన పండుగలు కావడంతో ప్రజలు సొంతూళ్లకు పయనం అవుతారు. కుటుంబసభ్యులతో కలిసి పండుగలు ఆనందంగా జరుపుకోనున్నారు. ఈ క్రమంలో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉంది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని టీజీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపాలని నిర్ణయించింది. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అదనపు సర్వీసులు అందుబాటులో ఉంచనుంది.

ఇటు ముఖ్యమైన పండుగలు, అటు వరుస సెలవులు.. దీంతో ఐటీ ఉద్యోగులు సొంతూళ్లకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు. గురువారం ఉగాది. శనివారం రంజాన్ సెలవు దినాలు. ఇక మిగిలింది శుక్రవారం ఒక్కరోజే. ఆ రోజున లీవ్ పెడితే ఆదివారంతో కలిపి వరుసగా నాలుగు రోజులు సెలవులు రానున్నాయి. దీంతో సొంతూరికి వెళ్లి కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితుల మధ్య పండుగను జరుపుకునేందుకు అంతా రెడీ అవుతున్నారు. ఈ క్రమంలో పండుగ రద్దీ దృష్ట్యా 17, 18 తేదీల్లో ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు టీజీఎస్ఆర్టీసీ ప్రకటించింది. ఈ ప్రత్యేక బస్సుల్లో స్పెషల్ చార్జీలు వర్తించనున్నాయి.

Also Read: పెట్రోల్ రేట్స్ బ్లాస్ట్.. ఒకేసారి లీటర్ పై 15 రూపాయలు పెంపు.. ఎక్కడంటే..