TGSRTC Good News : హైదరాబాద్ టు బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. టికెట్ రేట్లపై TGSRTC డిస్కౌంట్

ప్రయాణికులు ఈ మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలంగాణ ఆర్టీసీ కోరింది.

TGSRTC Good News : తెలంగాణ నుంచి కర్నాటక రాజధాని బెంగళూరుకు ప్రయాణం చేసే వారికి టీజీఎస్ ఆర్టీసీ అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణ నుంచి బెంగళూరు మార్గంలో ప్రయాణించే వారికి చార్జీల్లో ప్రత్యేక డిస్కౌంట్ ఇచ్చింది. ఆ మార్గంలో ప్రయాణించే వారికి 10శాతం రాయితీ కల్పిస్తున్నట్లు తెలంగాణ ఆర్టీసీ వెల్లడించింది. బెంగళూరుకు నడిచే అన్ని సర్వీసులకు ఈ డిస్కౌంట్ వర్తింపు ఉంటుంది.

ఏసీ స్లీపర్ (బెర్త్), ఏసీ స్లీపర్ స్టార్ (సీటర్), రాజధాని, నాన్ ఏసీ స్లీపర్ (బెర్త్), నాన్ ఏసీ సీటర్, సూపర్ లగ్జరీ బస్సుల్లో ఈ ప్రత్యేక రాయితీ ఉంటుంది. ఈ డిస్కౌంట్ తో ఒక్కొక్కరికి 100 రూపాయల నుంచి 160 రూపాయల వరకు ఆదా అవుతుందని టీజీఎస్ఆర్టీసీ తెలిపింది. ప్రయాణికులు ఈ మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలంగాణ ఆర్టీసీ కోరింది. ఈ డిస్కౌంట్ కు సంబంధించి మరిన్ని వివరాల కోసం, టికెట్ రిజర్వేషన్ కోసం ఆర్టీసీ వెబ్ సైట్ www.tgsrtcbus.in ను సంప్రదించాలంది.

Also Read : చాణక్యుడి ఈ 5 సూత్రాలను పాటిస్తే మీ ఇంట్లో డబ్బు కొరతే ఉండదు.. వద్దన్నా వస్తూనే ఉంటుంది.!

దేశంలోని ప్రధాన నగరాల్లో బెంగళూరు ఒకటి. ఐటీ హబ్ గా బెంగళూరుకు గుర్తింపు ఉంది. అక్కడో ఎన్నో ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీలు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలకు చెందిన అనేక మంది బెంగళూరులో సాఫ్ట్ వేర్ ఇంజినీర్లుగా పని చేస్తున్నారు. ఇక, హైదరాబాద్ నుంచి నిత్యం ఎంతో మంది తరుచుగా బెంగళూరు వెళ్లి వస్తుంటారు.

వీరిలో ఉద్యోగులతో పాటు వ్యాపారులు కూడా ఉన్నారు. ఇక, అనేక మంది ప్రజలు వేర్వేరు పనులు నిమిత్తం తరుచుగా బెంగళూరు వెళ్తుంటారు. వీకెండ్స్ లో ఈ రూట్ లో ప్రయాణించే వారి సంఖ్య మరీ ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలో ఆర్టీసీ ఇచ్చిన డిస్కౌంట్ తో వీరికి బిగ్ రిలీఫ్ కలగనుంది. ఈ డిస్కౌంట్ తో వారి ప్రయాణ ఖర్చులు తగ్గనున్నాయి.

తెలంగాణ టు బెంగళూరు రూట్ లో టికెట్ ధరలో 10శాతం డిస్కౌంట్ కు సంబంధించి టీజీఎస్ఆర్టీసీ ట్వీట్ చేసింది. డిస్కౌంట్ ఎంత, డిస్కౌంట్ కు ముందు టికెట్ రేట్ ఎంత, డిస్కౌంట్ తర్వాత ఎంత ధర తగ్గుతుంది.. ఇలాంటి వివరాలను అందులో మెన్షన్ చేశారు.

ఏసీ స్లీపర్ (బెర్త్) – ప్రస్తుతం టికెట్ ధర 1569 – 10శాతం డిస్కౌంట్ తో టికెట్ ధర 1412
ఏసీ స్లీపర్ స్టార్ (సీటర్) – ప్రస్తుత టికెట్ ధర 1203 – 10శాతం డిస్కౌంట్ తర్వాత టికెట్ ధర 1083
రాజధాని – ప్రస్తుత టికెట్ ధర 1203 – 10శాతం డిస్కౌంట్ తర్వాత టికెట్ ధర 1083
ఎన్ఏసీ స్లీపర్ (బెర్త్) – ప్రస్తుత టికెట్ ధర 1160 – 10శాతం డిస్కౌంట్ తర్వాత టికెట్ ధర 1044
ఎన్ఏసీ సీటర్ – ప్రస్తుత టికెట్ ధర 951 – 10శాతం డిస్కౌంట్ తర్వాత టికెట్ ధర 856
సూపర్ లగ్జరీ – ప్రస్తుత టికెట్ ధర 946 – 10శాతం డిస్కౌంట్ తర్వాత టికెట్ ధర 851