E Challan
E-Challan: అంతకు ముందు అంటే యాభై.. వందో ఫైన్ వేసి వదిలేసేవారు. కానీ దేశంలో కొత్త వాహన చట్టం అమలులోకి వచ్చిన తరువాత పాపం వాహన దారులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇబ్బందులు వస్తాయనే గాని, చట్టాన్ని ఖచ్చితంగా అందరూ పాటించాలి. అందు కోసమే చట్టాలను కఠినం చేస్తున్నారు. చట్టాలను అందరు చుట్టాలుగా మార్చుకొని ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్నారనే.. ప్రభుత్వం చట్టాలను కఠినం చేసేది.
భారీ స్థాయిలో చలనాలను తీసుకొస్తే.. తప్పుడు మార్గాల్లో వెళ్తే డబ్బులు కట్టాల్సి వస్తుంది అనే సత్యం బోధపడుతుంది. ఫలితంగా ఎవరు కూడా తప్పుడు మార్గాల్లో నడిచేందుకు సాహసం చేయరని జరిమానాల మోత మోగిస్తున్నారు. అయినా కొందరు అడ్డదిడ్డంగా రూల్స్ బ్రేక్ చేస్తుండడంతో ట్రాఫిక్ పోలీసులు కెమెరాలు పట్టుకొని చలానాలు ఆన్ లైన్లో విధిస్తున్నారు. అవి కాకుండా ట్రాఫిక్ కెమెరాల ద్వారా కూడా ఈ చలానాలు వస్తుంటాయి.
అలా వస్తున్నప్పుడైనా జాగ్రత్తగా ఉండాలి కదా.. అలా కూడా లేకుండా రూల్స్ బ్రేక్ చేసి చివరికి పోలీసులు చలానాలు కట్టమంటే ఓ వ్యక్తి ఏకంగా బండినే తగలబెట్టేశాడు. వికారాబాద్ జిల్లా పెద్దేముల్ గ్రామంలో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. టీఎస్ 34 డీ 2183 నెంబర్ గల ద్విచక్రవాహనంపై 5,500 రూపాయల చలానాలున్నాయి. బండిని ఆపిన పోలీసులు చలానాలు కట్టమన్నారు.
అయితే.. కూలీగా పనిచేసే తాను ఇంత మొత్తాన్ని ఎలా కట్టగలనని బండి యజమాని సంగప్ప ప్రశ్నించాడు. పోలీసులు కాదు కుదరదని తెగేసి చెప్పడంతో బండిని తగలబెట్టేశాడు. ఇదేంటని ప్రశ్నిస్తే.. ఆవేదనతోనే తాను బైక్‌ను తగలబెట్టానని చెప్పాడు. బైక్ తనకు అత్తింటివారు బహుమానంగా ఇచ్చారని..కానీ చలానాలు, పెరిగిన పెట్రోల్ ధరలతో ఈ బండిని తిప్పలేనని.. అదే లేకుంటే ఏ చలానాలు ఉండవనే ఇలా చేశానన్నారు.