Kalvakuntla kavitha : పంటల సేకరణపై FCI వార్షిక క్యాలెండర్‌ను విడుదల చేయాలి

ధాన్యం కొనుగోలు విషయంలో తెలంగాణ, కేంద్రం మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. తెలంగాణ రైతులు యాసంగిలో పండించిన వరి ధాన్యం కొనుగోలు చేయాలంటూ తెరాస ఆధ్వర్యంలో...

Kavitha Kalvakuntla

kalvakuntla kavitha : ధాన్యం కొనుగోలు విషయంలో తెలంగాణ, కేంద్రం మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. తెలంగాణ రైతులు యాసంగిలో పండించిన వరి ధాన్యం కొనుగోలు చేయాలంటూ తెరాస ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తుండటంతో పాటు ఢిల్లీలోనూ కేంద్రం తీరుపై తెరాస ఎంపీలు, నేతలు కేంద్రాన్ని నిలదీస్తున్నారు. తెలంగాణలో యాసంగి ధాన్యం కొనేవరకు ఆందోళనలు చేస్తామంటూ, కేంద్రంపై ఎంతటి పోరాటానికైనా సిద్ధమేనంటూ తెరాస నేతలు దూకుడును ప్రదర్శిస్తున్నారు.

 

ఈ క్రమంలో ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో వరి సేకరణ శూన్యమని అన్నారు. తెలంగాణ రైతులకు కేంద్రం మద్దతు ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. FCI కి సరియైన సేకరణ విధానం లేదని అన్నారు. పంటల సేకరణపై వార్షిక క్యాలెండర్ ను విడుదల చేయాలని FCI ని అభ్యర్థిస్తున్నామని, పంటల సేకరణ పై వార్షిక క్యాలెండర్ విడుదల చేస్తే రాష్ట్రాలు రైతులను తదనుగుణంగా పంటలు సాగు చేసుకొనేలా ఆదేశించవచ్చునని అన్నారు.

దేశవ్యాప్తంగా ఒకే విధంగా పంటల సేకరణ ఉండాలని, ఒక రాష్ట్రంలో ఒకలా మరొక రాష్ట్రంలో మరొకలా ఉండటం సరికాదని పేర్కొన్నారు. తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వం పక్షపాత హద్దులన్నీ దాటేసిందన్న కవిత.. సీఎం కేసీఆర్‌ నాయకత్వంలోని టీఆర్‌ఎస్‌ పార్టీ తెలంగాణ రైతులు, వారి శ్రమ, పంటల విషయంలో వెనక్కి తగ్గదన్నారు. మోడీ ప్రభుత్వం ముందుకు వచ్చి ప్రతి వరి గింజను తెలంగాణ రైతుల నుండి సేకరించాలని ట్విటర్ వేదికగా కవిత డిమాండ్ చేశారు.