Telangana High Court : డ్రగ్స్‌తో సంబంధాలున్న వారిని దాచిపెట్టాల్సిన అవసరమేంటి? తెలంగాణ హైకోర్టు

డ్రగ్స్ కేసుల విచారణను కేంద్ర దర్యాప్తు సంస్థలకు అప్పగించాలంటూ దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు విచారించింది.

The High Court Hearing A Petition Seeking Transfer Of Drug Cases To The Central Bureau Of Investigation

drug cases to the CBI : డ్రగ్స్ కేసుల వివరాలను ఎక్సైజ్ శాఖ తమకు ఇవ్వడం లేదని ఈడీ తెలంగాణ హైకోర్టుకు వివరించింది. డ్రగ్స్ కేసుల విచారణను కేంద్ర దర్యాప్తు సంస్థలకు అప్పగించాలంటూ దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు విచారించింది. ఈ సందర్భంగా.. ఈడీకి వివరాలు ఎందుకు ఇవ్వడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

డ్రగ్స్‌తో సంబంధాలున్న వారిని దాటిపెట్టాల్సిన అవసరమేంటని న్యాయస్థానం ప్రశ్నించింది. డ్రగ్స్‌పై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఏం చేస్తోందని ప్రశ్నించింది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 4 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది.

డ్రగ్స్‌ కేసులు కేంద్ర దర్యాప్తు సంస్థలకు అప్పగించాలన్న పిల్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. 2016లో నమోదైన డ్రగ్స్‌ కేసులను సీబీఐ, ఇవ్వడం లేదని పిటిషనర్ తరఫు న్యాయవాది తెలిపారు.

ఎక్సైజ్ అధికారులు డ్రగ్స్‌ కేసుల వివరాలు ఇవ్వడం లేదని ఈడీ వివరించింది. ఎఫ్‌ఐఆర్‌లు, చార్జిషీట్లు, వాంగ్మూలాలు ఇచ్చేలా ఆదేశించాలని ఈడీ కోరింది.