heavy rains in Telangana
Heavy Rains In Telangana : తెలంగాణలో మరో మూడు రోజులు భారీ వర్షాలు కురువనున్నాయి. రాష్ట్రంలో ఈ నెల 4 నుంచి 6 వరకు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదారాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఏపీ తీరంలోని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉన్న ఆవర్తనం సముద్ర మట్టానికి 5.8 కిలో మీటర్ల ఎత్తు వరకు విస్తరించి నైరుతి దిశగా వంపు తిరిగి ఉందని తెలిపింది.
అలాగే ఈశాన్య బంగాళాఖాతం పరిసరాల్లో ఏర్పడిన మరో ఆవర్తనం సముద్ర మట్టానికి 5.8 కిలో మీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని పేర్కొంది. వీటి ప్రభావంతో ఈ నెల 4వ తేదీ నుంచి నుంచి మూడు రోజుల పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రాథమిక హెచ్చరికలు జారీ చేసింది.
Heavy Rains In AP : ఏపీలో రానున్న మూడు రోజులు భారీ వర్షాలు
గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 440 మండలాల్లో పొడి వాతావరణం ఏర్పడినట్లు టీఎస్‌డీపీఎస్ వెల్లడించింది. మిగిలిన వాటిల్లో 10 మండలాల్లో ఒక మోస్తరు వర్షం కురువగా.. పలు చోట్ల చిరు జల్లులు పడ్డాయని తెలిపింది.
10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.