రాజకీయాల్లో పైకి కనిపించేది, వినిపిచేందేదీ నిజం కాదు. ప్రపంచానికి తెలియని పరిణామం ఏదో తెర వెనక జరుగుతూ ఉంటుంది. గువ్వల బాలరాజు పార్టీ మార్పుపై ఇప్పుడు జరుగుతున్న చర్చ ఇదే. ఉన్నట్లుండి కారు దిగిపోయిన ఆయన.. గులాబీ పార్టీకే కాదు.. రాజకీయవర్గాలకు కూడా షాక్ ఇచ్చారు. గువ్వల పార్టీ మార్పు వెనక కారణం ఏంటా అని ఇప్పటికీ చర్చ జరుగుతూనే ఉంది. అసలు ఆల్ ఆఫ్ సడెన్‌గా ఆయన ఎందుకు పార్టీ మారారు.. ఆయన పైకి చెప్తున్న కారణాలేవీ నిజం కాదా.. అసలు వాస్తవాలు వేరే ఉన్నాయా.. ఆ రెండు కారణాలే గులాబీ పార్టీని వీడేలా చేశాయా.. పార్టీ మార్పు వెనక అసలేం జరిగింది.. అసలు గువ్వల చేరిక వేళ.. బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఎందుకు అంటీముట్టనట్లు ఉంది..
రాజకీయాల్లో అంతే.. కనిపించే పరిణామం, వినిపించే మాట.. పూర్తిగా ఎప్పుడూ నిజం కాదు. ప్రతీ సంఘటన వెనక.. ప్రతీ నిర్ణయం వెనక ప్రపంచం ఊహించలేని ఓ వ్యూహం కనిపిస్తూనే ఉంటుంది. నాయకులు వేరే ప్రతీ అడుగు.. తీసుకునే ప్రతీ నిర్ణయం.. రాజకీయ కోణంలోనే ఉంటుంది. పైకి చెప్పేది ఒకటయితే.. లోపల జరిగేది, చేసేది మరొకటి ! మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఎపిసోడ్‌లో జరుగుతున్న చర్చ ఇదే ! మాములుగా జంపింగ్ జపాంగ్‌లు ఎన్నికల ముందు కనిపిస్తుంటాయ్.
ఐతే అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా మూడేళ్ల సమయం ఉన్నా.. పార్టీ మార్పులతో తెలంగాణ రాజకీయాలు హీటెక్కుతున్నాయ్. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు.. ఆల్ ఆఫ్ సడెన్‌గా కండువా మార్చేశారు. చడీచప్పుడు లేకుండా.. గులాబీ పార్టీకి గుడ్‌బై చెప్పేశారు. ఆయన ఎందుకు జంప్ చేశారనే సంగతి కంటే.. పార్టీ మార్పునకు ఆయన చెప్తున్న కారణం చుట్టూనే ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఆయన పైకి చెప్తున్న కారణాల వెనక అసలు వాస్తవాలు వేరే ఉన్నాయనే గాసిప్ మొదలైంది.
గువ్వల బాలరాజు పార్టీ మారడం వెనక.. రెండు కారణాలు ఉన్నాయని.. ఆయన సన్నిహితులు చెప్తున్నారు. మొదటం కారణం అయితే.. అసెంబ్లీ సీటు విషయంలో ఆయన కాస్త ఆందోళనలో ఉన్నారట. రెండుసార్లు ప్రాతినిధ్యం వహించిన అచ్చంపేట అసెంబ్లీ సెగ్మెంట్‌లో.. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి ఆయనకు టికెట్ దక్కే అవకాశాలు అంతంత మాత్రమేనట. ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ సోదరుడు ప్రసన్నకుమార్‌కు.. వచ్చే ఎన్నికల్లో అచ్చంపేట టికెట్ ఇచ్చే చాన్స్ ఉందట. 2023 ఎన్నికల్లో బీఎస్పీ నుంచి పోటీ చేసిన ప్రసన్నకుమార్.. గులాబీ కండువా కప్పుకున్న తర్వాత.. అచ్చంపేటపై ఫోకస్ పెంచారు కూడా !+
అందుకే గులాబీ పార్టీకి గుడ్ బై?
ఇక అటు గువ్వల వ్యవహారశైలిపై కూడా రకరకాల చర్చ నడుస్తోంది. ఆయన తీరు పార్టీకి మైనస్‌గా మారిందనే ఆలోచనలో కారు పార్టీ పెద్దలు ఉన్నాయని.. వచ్చే ఎన్నికల్లో గువ్వలను పక్కన పెట్టడమే బెటర్ అనే ఆలోచనలో ఉన్నారట. ఈ విషయాన్ని ముందే గ్రహించిన గువ్వల.. తానే ముందు తప్పుకుంటే సేఫ్ అనే ఆలోచనతో గులాబీ పార్టీకి గుడ్‌బై చెప్పారనే టాక్ వినిపిస్తోంది.
గువ్వల బాలరాజు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటారు. హైదరాబాద్ చుట్టుపక్కల భూముల కొనుగోలు, అమ్మకాల్లో ఆరితేరారు. ఈ బిజినెస్‌లో గువ్వలకు మంచి ప్రాఫిట్స్ కూడా వచ్చాయట. ఐతే రియల్ ఎస్టేట్ వ్యాపారం సాఫీగా సాగాలంటే.. కచ్చితంగా బలం ఉండాల్సిందే.. అధికార పార్టీ సపోర్టు కావాల్సిందే ! ఇక ఈ మధ్య.. బిజినెస్‌లో పొలిటికల్ సపోర్ట్ కోసం.. బీజేపీ నేతతో కలిసి పనిచేస్తున్నారని టాక్. ఈ ప్రాసెస్‌లో కాషాయ తీర్థం పుచ్చుకోవాలని.. దీంతో ఇద్దరికీ లాభం ఉంటుందని ఆ నాయకులు సలహా ఇచ్చారట.
Also Read: వైసీపీలో మరో అరెస్ట్‌కు రంగం సిద్ధమా? మాజీ మంత్రి రోజా అరెస్ట్ ఖాయమా?
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఆ నేత అత్యంత సన్నిహితుడు. బీజేపీ కొత్త అధ్యక్షుడి ఎంపికపై రకరకాల ప్రచారం జరుగుతున్న వేళ.. చేరికలతో దానికి ఫుల్‌స్టాప్ పెట్టాలని ఆ నేత ఆలోచన చేశారట. గువ్వలను నేరుగా బీజేపీ అగ్రనాయకత్వం దగ్గరికి తీసుకెళ్లారరట. బీఎల్ సంతోష్ వద్దకు తీసుకెళ్లి ఓకే చేయించుకున్నారట. ఇలా గువ్వల బీజేపీ తీర్థం పుచ్చుకున్నారని తెలుస్తోంది.
గువ్వల చేరికపై.. బీజేపీ రాష్ట్ర నాయకత్వం సైలెన్స్ మెయింటేన్ చేస్తోందనే చర్చ నడుస్తోంది. దీని వెనక కారణం వేరే ఉందట. తమకు ఎలాంటి సమాచారం లేకపోవడంతో.. పార్టీలో గువ్వల చేరికకు తెలంగాణ నేతలంతా దూరంగా ఉన్నారట. ఇద్దరు కేంద్ర మంత్రులు హైదరాబాద్‌లో ఉండి కూడా.. చేరిక కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. ఆఖరికి ఉమ్మడి పాలమూరులో బలమైన నేత, మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ కూడా.. ఈ కార్యక్రమంలో కనిపించలేదు. ఓవరాల్‌గా.. గువ్వల బాలరాజు బీజేపీలో చేరిక విషయంలో పెద్ద తతంగమే నడిచిందట. చూడాలి మరి..