stay on BRS will continue as usual : LRS, BRSపై సుప్రీంకోర్టు తుది ఆదేశాల తర్వాత విచారణ జరుపుతామని తెలంగాణ హైకోర్టు ప్రకటించింది. BRSపై స్టే యథావిధిగా కొనసాగుతుందని తెలిపింది. LRS, BRSపై సుప్రీంకోర్టులో విచారణ పెండింగ్‌లో ఉందని, తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది.
సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన ఆర్డర్ కాపీలను సమర్పించాలని ప్రభుత్వానికి ఆదేశించింది. ఎల్‌ఆర్‌ఎస్ మీద ప్రభుత్వం తెచ్చిన జీవోపై ఎలాంటి నిర్ణయాలూ తీసుకోబోమని ఏజీ హైకోర్టుకు తెలిపారు. ఏజీ స్టేట్‌మెంట్‌ను హైకోర్టు నమోదు చేసుకుంది. ఎల్‌ఆర్‌ఎస్, బీఆర్‌ఎస్‌పై విధివిధానాలు తెలపాలని మూడు రాష్ట్రాలను గతంలో సుప్రీంకోర్టు ఆదేశించింది.