Union Home Minister's Medals
Union Home Minister’s Medals : జాతీయ స్థాయిలో తెలంగాణ పోలీసులు సత్తా చాటారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రకటించిన యూనియన్ హోం మినిస్టర్స్ స్పెషల్ ఆపరేషన్ మెడల్స్ కు 13 మంది తెలంగాణ పోలీసులు ఎంపికయ్యారు. అత్యుత్తమ పనితీరుతో కేంద్ర హోంమంత్రి స్పెషల్ ఆపరేషన్ మెడల్‌కు తెలంగాణ పోలీస్ విభాగం నుంచి మొత్తం పదకొండు మందిని ఎంపిక చేశారు.
అవార్డులకు ఎంపికైనవారి జాబితాను కేంద్ర హోం కార్యదర్శి డీకే ఘోష్ సోమవారం వెల్లడించారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు 2022 ఏడాదికి ఈ అవార్డుకు ఎంపికైన వారిలో తెలంగాణ అడిషనల్ డీజీ (ఇంటెలిజెన్స్ చీఫ్) అనిల్‌కుమార్ ఉన్నారు. ఈ ఏడాది మే 5న చేపట్టిన పోలీస్ ఆపరేషన్‌కుగానూ ఆయనకు అవార్డు దక్కింది.
Prophet row: సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్న తెలంగాణ పోలీసులు
డీఎస్పీ ఖైత రవీందర్‌రెడ్డితోపాటు ఇన్‌స్పెక్టర్ మొగుల్ల వెంకటేశ్వరగౌడ్, ఎస్సైలు కుకుడపు శ్రీనివాసులు, మహ్మద్ అక్తర్‌పాషా, పాండే జితేందర్ ప్రసాద్, సయ్యద్ అబ్దుల్ కరీం, హెడ్ కానిస్టేబుళ్లు సనుగొమ్ముల రాజవర్ధన్‌రెడ్డి, మహ్మద్ తాజ్‌పాషా, కానిస్టేబుళ్లు మహ్మద్ ఫరీదుద్దీన్, బచ్చు లక్ష్మీనారాయణ, కొడ్గల్ కిరణ్‌కుమార్, సయ్యద్ జియావుల్‌హక్ కేంద్ర అవార్డుకు ఎంపికయ్యారు.