ప్రేమ పేరుతో బాలికను గర్భవతిని చేసిన యువకుడు.. పాపకు జన్మనిచ్చిన మైనర్

The young man who made a girl pregnant in the name of love : ప్రేమ పేరుతో మైనర్ బాలికను మోసం చేశాడు ఓ దుర్మార్గుడు. అప్పుడు ప్రేమించకపోతే చనిపోతానన్నాడు. ఇప్పుడు పెళ్లిచేసుకోమంటే చంపేస్తానంటున్నాడు. కరీంనగర్‌ జిల్లాలో మైనర్‌బాలికను ప్రేమ పేరుతో వంచించాడు సమీర్‌ అనే యువకుడు. అమ్మాయి గర్భవతి అని తెలియగానే ముఖం చాటేశాడు. ఇప్పుడు పాప పుట్టినా అతని మనసు కరగడం లేదు.

మహబూబ్‌నగర్‌ నుంచి ఓ కుటుంబం ఉపాధి కోసం కరీంనగర్‌కు వలస వెళ్లింది. తల్లిదండ్రులకు తోడుగా ఆ బాలిక ఓ షాప్‌లో పనిచేసేది. అమ్మాయిపై కన్నేసిన సమీర్‌ ఆమెకు మాయ మాటలు చెప్పి.. లొంగదీసుకుని గర్భవతిని చేశాడు. గత నవంబర్ 12 న బాలిక.. పాపకు జన్మనిచ్చింది. అప్పటి నుంచి ఎన్నిసార్లు ఫోన్ చేసినా సమీర్‌ పట్టించుకోవడం లేదు. పెళ్లి చేసుకోవాలని ప్రాదేయపడితే చంపేస్తానని బెదిరిస్తున్నాడు.

దీంతో బాధితురాలి కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసుల ఒత్తిడితో పెళ్లి చేసుకున్నా జీవితాంతం టార్చర్ చేస్తానని సమీర్ తనను బెదిరిస్తున్నాడని బాలిక వాపోతుంది. సమీర్ మరొకరిని మోసం చేయొద్దంటే అతడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తుంది. అప్పుడు ప్రేమించానన్న సమీర్ ఇప్పుడు 3 లక్షల కట్నం కావాలంటున్నాడన్నాడని బాధితురాలి తల్లి వాపోయింది. తన కూతురుకు న్యాయం చేయాలని వేడుకుంటుంది.