ప్రజలకు నిత్యావసర వస్తువుల సరఫరా జరిగేలా చేయడంలో ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు కావాల్సిన ఏర్పాట్లు చేస్తామని.. మంత్రి కేటీఆర్ సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఆహార ఉత్పత్తులు తరలించేవారు ఏయే రూట్లలో అనుమతి కావాలో ముందుగా దరఖాస్తులు చేసుకోవాలి. వస్తువుల సరఫరా, తయారీ విషయంలో తక్కువ మంది మాత్రమే ఉండాలని, సామాజిక దూరం పాటించాలని సూచించారు.
‘సైబరాబాద్‌లో కొందరు పాసులు తీసుకొని ఇలానే దుర్వినియోగం చేశారన్నారు. ఈ మేర హైదరాబాద్ కమిషనర్ ఆఫ్ పోలీస్ అంజనీకుమార్.. ప్రజలకు నిత్యావసరాలు సరఫరా చేయడంలో వ్యాపారులకు ఇబ్బందులు ఎదురుకాకుండా ఉండాలని ఆ మేరకు చర్యలు తీసుకుంటారని అన్నారు.
పాసులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు:
నిత్యావసర వస్తువులు సరఫరా చేసే వారికి హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ నుంచి పాసులు జారీ చేస్తున్నామని సీపీ తెలిపారు. కమిషనరేట్‌లో హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా covid19.hyd@gmail.com, వాట్సప్ 9490616780 నెంబర్లను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు.
ప్రజల సౌకర్యం కోసం 900 పాసులు జారీ చేశామని, మరో 750 వ్యక్తిగత పాసులు జారీ చేశామన్నారు. అవేగాక, 700 పాసులు సిద్ధమవుతున్నాయన్నారు. పాసులు కావాల్సిన వాళ్లు ఆన్‌లైన్‌లో హెల్ప్‌డెస్క్ ఈమెయిల్, వాట్సాప్ నంబర్లకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. నిత్యావసరాల కోసం ప్రజలు ఇబ్బందులు పడకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ తెలిపారు.
సరుకులు అధిక ధరలకు విక్రయిస్తున్న మెడికల్, కిరాణా, కూరగాయల దుకాణాలకు సైబరాబాద్ ఎస్‌ఓటీ పోలీసులు ఆకస్మిక దాడులు చేసి.. దాదాపు 15 మందిని అదుపులోకి తీసుకున్నారు. ప్రజలు అధిక ధరలు ఇతర అంశాలపై డయల్ 100 లేదా సైబరాబాద్ వాట్సాప్ నెం. 9490617444కు సమాచారం అందించగలరని ఆయన కోరారు.
Also Read | కోవిడ్ -19పై పోరాటం : సేవ చేసేందుకు ముందుకొచ్చిన 500 మంది వైద్యులు