Cm Revanth Reddy: ఇదే నాకు నోబెల్, ఇదే నాకు ఆస్కార్- ఆ లేఖ గురించి సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఏంటా లెటర్, ఎవరిచ్చారు..

ఇది జస్ట్ లేఖ మాత్రమే కాదు.. ఇది నా లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అని రేవంత్ రెడ్డి చెప్పారు.

Cm Revanth Reddy: తెలంగాణ కులగణన సర్వేపై దేశ రాజధాని ఢిల్లీలో కాంగ్రెస్ ఎంపీలకు పవర్ పాయింట్ ప్రజంటెషన్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ఎంపీలకు ఆయన ఓ లేఖను చూపించారు. దాని గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది.. కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ తనను ప్రశంసిస్తూ పంపిన లేఖ అని రేవంత్ రెడ్డి చెప్పారు. సోనియా గాంధీ సొంత దస్తూరితో తనను ప్రశంసిస్తూ ఆ లేఖను పంపారని తెలిపారు.

సోనియా గాంధీ పేరుతో వచ్చిన ఈ అప్రిసియేషన్ లెటర్.. తనకు చాలా ప్రత్యేకం అన్నారు రేవంత్ రెడ్డి. ఆ లేఖను ఆయన ఆస్కార్, నోబెల్ పురస్కారాలతో పోల్చారు. ఇదే నాకు నోబెల్, ఇదే నాకు ఆస్కార్ అని చెప్పారు. ఇది జస్ట్ లేఖ మాత్రమే కాదు.. ఇది నా లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అని రేవంత్ రెడ్డి అన్నారు. దీంతో కాంగ్రెస్ ఎంపీలంతా చప్పట్లతో రేవంత్ రెడ్డిని అభినందించారు.

”ఇదే నాకు నోబెల్ ప్రైజ్. ఇదే నాకు ఆస్కార్ అవార్డ్. నన్ను ప్రశంసిస్తూ సోనియా గాంధీ నాకు ఒక లేఖ రాశారు. ఇది నాకు లైఫ్ టైమ్ అచీవ్ మెంట్. నేను చాలా పనులు చేయగలను. సంక్షేమం చేయగలను, అభివృద్ధి చేయగలను. మరో కుర్చీపై కూర్చోగలను. సోనియా గాంధీ సొంత దస్తూరితో నాకు రాసిన ఈ లేఖ నాకు ఎంతో ప్రత్యేకమైనది” అని రేవంత్ రెడ్డి అన్నారు.

నీకు సీఎం కుర్చీ దొరికిందని కొందరు మిత్రులు అంటుంటారు- సీఎం రేవంత్
ఇదే పవర్ పాయింట్ ప్రజంటేషన్ లో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కుర్చీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నీకు సీఎం కుర్చీ దొరికిందని కొందరు మిత్రులు అంటుంటారని రేవంత్ రెడ్డి అన్నారు.

”నేను ముందు నుంచి కాంగ్రెస్ లో లేను నీకు సీఎం కుర్చీ దొరికిందని కొందరు మిత్రులు అంటుంటారు. కానీ నేను కాంగ్రెస్ లోకి వచ్చాక రాహుల్ గాంధీ ఆత్మతో కలసిపోయాను, మమేకం అయ్యాను. రాహుల్ గాంధీ గుండె ఏం కోరుకుంటుందో అదే నేను చేశాను. సామాజిక న్యాయం కులగణన ఘనత రాహుల్ గాంధీదే. రాహుల్ గాంధీ కోరిక మేరకు కులగణన చేసి చూపించాం. ఫిబ్రవరి 4 సామాజిక న్యాయ దినం. కాంగ్రెస్ తోనే ఏదైనా సాధ్యం.

Also Read: మాజీ మంత్రి మల్లారెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు.. భారీగా డబ్బులు వసూలు చేసినట్లుగా ఆరోపణలు..

మోదీ పుట్టుకతో బీసీ కాదు. ముఖ్యమంత్రి అయ్యాక బీసీగా కన్వర్ట్ అయ్యారు. రాహుల్ గాంధీ నినాదం వల్లే మోదీ ప్రభుత్వం కులగణన లెక్కలకు ముందుకొచ్చింది. తెలంగాణ కులగణన మోడల్ ఇప్పుడు దేశ మోడల్ గా మారింది” అని సీఎం రేవంత్ అన్నారు.

తెలంగాణ కులగణన సర్వేపై ఢిల్లీలో సీఎం రేవంత్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. రాష్ట్రంలో చేసిన కులగణన సర్వే తీరును కాంగ్రెస్ ఎంపీలకు ఆయన వివరించారు. ఈ ప్రజంటేషన్ కు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ హాజరయ్యారు.