YS Sharmila : కవిత అరెస్ట్ ఎప్పుడు? కారు, కమలం రెండూ ఒక్కటే..!- వైఎస్ షర్మిల
YS Sharmila : బిడ్డ లిక్కర్ స్కాంలో దొరకగానే.. ఢిల్లీకి వెళ్లి రహస్యంగా బీజేపీకి పొర్లు దండాలు పెట్టారు. కొడుకు రియల్ ఎస్టేట్ మాఫియా బయటపడకుండా బీజేపీ అధిష్టానానికి మోకాళ్లు వంచారు.
- Naveen
- Published On : June 5, 2023 / 04:36 PM IST
YS Sharmila
YS Sharmila – KCR : అధికార పార్టీని మరోసారి టార్గెట్ చేశారు వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటే అంటూ ఆమె ఘాటుగా ట్వీట్ చేశారు. “WASHING POWDER NIRMA” కేసీఆర్ కు సైతం పని చేసినట్టు ఉందని షర్మిల అన్నారు. నిర్మాతో నిర్మల్ వేదికగా దొర ముసుగు తొలగిందని, బీజేపీతో దోస్తీ బయటపడిందని కామెంట్ చేశారు. కారు-కమలం రెండూ ఒక్కటేనన్న తళతళ మెరుపు కేసీఆర్ ముఖంలో కనపడ్డదని షర్మిల అన్నారు. నోరు విప్పితే బీజేపీని తిట్టే కేసీఆర్ దొర.. మోదీని పల్లెత్తు మాట కూడా అనడం లేదని, దీనికి కారణం ఏంటో చెప్పాలని షర్మిల డిమాండ్ చేశారు.
” బిడ్డ లిక్కర్ స్కాంలో దొరకగానే.. ఢిల్లీకి వెళ్లి రహస్యంగా బీజేపీకి పొర్లు దండాలు పెట్టారు. కొడుకు రియల్ ఎస్టేట్ మాఫియా బయటపడకుండా బీజేపీ అధిష్టానానికి మోకాళ్లు వంచారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో కేసీఆర్ దోచుకున్న లక్ష కోట్ల గురించి అడగవద్దని బీజేపీకి సలాం కొట్టారు” అని షర్మిల ట్వీట్ చేశారు.
” అవసరానికి తగ్గట్లు వేషాలు మారుస్తూ, జనాలను పిచ్చోళ్ళను చేయడమే BJP, BRS రహస్య అజెండా. నువ్వు కొట్టినట్లు చెయ్యి. నేను ఏడ్చినట్లు చేస్తా. ఇన్నాళ్లు బీజేపీతో కేసీఆర్ నడిపిన దోస్తానా ఇదే. ఇంతకు మీరు నడిపే రహస్య దోస్తానా.. ప్రీ పోల్ ఒప్పందమా..? పోస్ట్ పోల్ ఒప్పందమా..?
కమలం ముసుగు కప్పుకొని కారులో తిరిగే కేసీఆర్ దొర.. అసలు విషయం బయటపెట్టు.
కేసీఆర్ అవినీతి గురించి మాట్లాడని బీజేపీ సైతం తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి. రాబోయే ఎన్నికల్లో కేసీఆర్ కు మద్దతు తెలపడమే బీజేపీ రహస్య ఒప్పందమా? బీజేపీ అభ్యర్థులు కేసీఆర్ కు సప్లయింగ్ కంపెనీలా మారడమే సీక్రెట్ అగ్రిమెంటా? కేసీఅర్ కు సీట్లు తక్కువ పడితే ఎమ్మెల్యేలను అందించడమే తెర వెనుక ఒప్పందమా ? ఏ ఒప్పందం లేకపోతే కేసీఆర్ అవినీతిపై చర్యలు ఏవి? కవిత అరెస్టుపై ఎందుకీ సాగదీత? తక్షణం బీజేపీ నోరు విప్పాలి” అని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ డిమాండ్ చేస్తోందన్నారు వైఎస్ షర్మిల.
Also Read.. CM KCR: రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే ప్రజలు అందరూ ఈ పని చేయాలి: సీఎం కేసీఆర్
“WASHING POWDER NIRMA” కేసీఆర్ కు సైతం పనిచేసినట్టు ఉంది.
నిర్మాతో నిర్మల్ వేదికగా దొర ముసుగు తొలగింది. బీజేపీతో దోస్తీ బయటపడింది.
కారు – కమలం రెండూ ఒక్కటేనన్న తళతళ మెరుపు కేసీఆర్ మొఖంలో కనపడ్డది.
నోరు విప్పితే బీజేపీని తిట్టే కేసీఆర్ దొర.. మోడీని పల్లెత్తుమాట కూడా అనడం లేదు.…
— YS Sharmila (@realyssharmila) June 5, 2023
