CM KCR: రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే ప్రజలు అందరూ ఈ పని చేయాలి: సీఎం కేసీఆర్

బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయానికి త్వరలో పునాది రాయి వేస్తానని కేసీఆర్ అన్నారు.

CM KCR: రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే ప్రజలు అందరూ ఈ పని చేయాలి: సీఎం కేసీఆర్

CM KCR

CM KCR – Nirmal: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్మల్ జిల్లాలో కొత్త కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించారు. మరికొన్ని కార్యక్రమాల్లో పాల్గొని అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ధరణి పోర్టల్ ను బంగాళాఖాతంలో వేస్తామనడం హాస్యాస్పదమని చెప్పారు. భూముల గోల్ మాల్ కోసం యత్నించాలని చూస్తున్న కాంగ్రెస్ పార్టీని బంగాళాఖాతంలో వేయాలని చెప్పారు.

తెలంగాణ సుభిక్షంగా ఉండాలంటే ప్రజలు బీఆర్ఎస్ కి మద్దతు ఇవ్వాలని కేసీఆర్ అన్నారు. దేశంలోనే తలసరి ఆదాయంలో తెలంగాణ అగ్రగామిగా ఉందని చెప్పారు. ప్రతి తండాకు లక్ష రూపాయల నిధులు ఇస్తున్నామని తెలిపారు. మహారాష్ట్రలో అప్ కి బార్ కిసాన్ సర్కార్ నినాదానికి అపూర్వ స్పందన వస్తోందని తెలిపారు.

బీఆర్ఎస్ పాలనలో ఉమ్మడి జిల్లాలో ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేస్తామని చెప్పారు. నిర్మల్ జిల్లాలోని 396 గ్రామపంచాయతీలకు తలో రూ.10 లక్షల నిధులు ఇస్తామన్నారు. పదో తరగతి ఫలితాల్లో నిర్మల్ జిల్లా నం.1 సాధించడం అభినందనీయమని తెలిపారు.

బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయానికి త్వరలో పునాది రాయి వేస్తానని అన్నారు. బహిరంగ సభలో బీజేపీ గురించి కేసీఆర్ మాట్లాడలేదు. కేవలం కాంగ్రెస్ టార్గెట్ గానే కేసీఆర్ స్పీచ్ కొనసాగింది. కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచాక ఆ పార్టీ తెలంగాణ నేతల్లో ఆత్మవిశ్వాసం పెరిగింది.

Anam Ramanarayana Reddy : భవిష్యత్తులో స్ట్రీట్ వార్ జరిగే ప్రమాదం ఉంది- ఆనం రామనారాయణరెడ్డి హెచ్చరిక