Bandi Sanjay Kumar : బండి సంజయ్ పదవి పోవడానికి కారణం ఇదే.. బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

Bandi Sanjay Kumar : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీజేపీ అధిష్ఠానం ఊహించని మార్పులు చేసింది. బండి సంజయ్ ని అధ్యక్ష పదవి నుంచి తప్పించింది.

Gongidi Sunitha, Bandi Sanjay (Photo : Twitter)

Bandi Sanjay – BRS MLA : బండి సంజయ్ పై ఆలేరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గొంగిడి సునీత (gongidi sunitha) హాట్ కామెంట్స్ చేశారు. యాదాద్రి (Yadadri) లో బండి సంజయ్ తొండి ప్రమాణం చేశారని, అందుకే అధ్యక్ష పదవి పోయిందని అన్నారు. మసీదులు, ఘోరీలు తవ్వుతామంటే ఇలాగే జరుగుతుందని ఎమ్మెల్యే సునీత మండిపడ్డారు.

కాగా, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీజేపీ అధిష్ఠానం ఊహించని మార్పులు చేసింది. బండి సంజయ్ ని అధ్యక్ష పదవి నుంచి తప్పించింది. కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి బీజేపీ తెలంగాణ చీఫ్ బాధ్యతలు అప్పగించింది.

Also Read: ధర్మపురిలో వివేక్ పోటీ చేస్తే ట్రయాంగిల్ ఫైట్.. హీటెక్కుతోన్న ధర్మపురి రాజకీయం

అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ట్విటర్‌లో తెలిపారు బండి సంజయ్‌. ఈ సందర్భంగా ప్రధాని మోదీ సహా బీజేపీ అగ్రనేతలకు, ప్రజా సంగ్రామ యాత్ర సమయంలో తనను స్వాగతించిన ప్రజలకు, అరెస్టుల సమయంలో తనకు అండగా నిలిచిన కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారాయన. కిషన్‌రెడ్డి నేతృత్వంలో మరింత ఉత్సాహంతో పార్టీ కోసం పని చేస్తానని బండి సంజయ్ చెప్పారు.

కాగా, బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తనను తప్పించడం పట్ల బండి సంజయ్‌ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు ఆ పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు. కీలక సమయంలో అనూహ్య నిర్ణయం తీసుకోవడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారట. ఓవైపు రాష్ట్ర పార్టీ వ్యవహారాలపై అగ్రనేతలు ప్రశంసలు కురిపిస్తూనే, శభాష్ అంటూ బండి సంజయ్ భుజం తడుతూనే.. మరోవైపు పదవి నుంచి తప్పించడంతో ఆయన ఆవేదన చెందినట్లు సమాచారం. పార్టీ అవసరాల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు బండి సంజయ్ కు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా వివరణ ఇచ్చినట్లు సమాచారం.

Also Read: అధ్యక్ష బాధ్యతలు చేపట్టేందుకు సుముఖంగాలేని కిషన్ రెడ్డి? కేబినెట్ సమావేశానికి గైర్హాజరు అందుకేనా?