Kishan Reddy: అధ్యక్ష బాధ్యతలు చేపట్టేందుకు సుముఖంగాలేని కిషన్ రెడ్డి? కేబినెట్ సమావేశానికి గైర్హాజరు అందుకేనా?

ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఢిల్లీలోని 7లోక్ కళ్యాణ్ మార్గ్‌లో కేంద్ర కేబినెట్ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గౌర్హాజరు కావటం చర్చనీయాంశంగా మారింది.

Kishan Reddy: అధ్యక్ష బాధ్యతలు చేపట్టేందుకు సుముఖంగాలేని కిషన్ రెడ్డి? కేబినెట్ సమావేశానికి గైర్హాజరు అందుకేనా?

Kishan Reddy

Kishan Reddy: బీజేపీ (BJP) కేంద్ర అధిష్టానం తెలంగాణ బీజేపీ (Telangana BjP) లో కీలక మార్పులు చేసింది. అధ్యక్ష బాధ్యతల నుంచి బండి సంజయ్‌ (Bandi Sanjay) ను తప్పించి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) ని ఆ పదవిలో నియమిస్తూ బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా (JP Nadda) ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే, రాష్ట్ర పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టేందుకు కిషన్ రెడ్డి సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. బీజేపీ నేతలు, కార్యకర్తలు అభినందనలు తెలుపుతున్నప్పటికీ కిషన్ రెడ్డి స్పందించడం లేదని సమాచారం. మంగళవారం మధ్యాహ్నం కిషన్ రెడ్డిని అధ్యక్షునిగా నియమిస్తూ జేపీ నడ్డా ప్రకటించారు. అప్పటి నుంచి బుధవారం ఉదయం వరకు కిషన్ రెడ్డి ఎలాంటి స్పందన వెలుబుచ్చలేదు. మీడియాతోసైతం మాట్లాడేందుకు కిషన్ రెడ్డి సుముఖంగా లేనట్లు సమాచారం.

Bandi Sanjay: కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్‌లను ఉద్దేశిస్తూ బండి సంజయ్ మరో ఆసక్తికర ట్వీట్..

మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఢిల్లీలోని 7లోక్ కళ్యాణ్ మార్గ్‌లో కేంద్ర కేబినెట్ సమావేశం జరుగుతుంది. మంత్రివర్గ పున:వ్యవస్థీకరణ నేపథ్యంలో ఈ కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకొనే అవకాశాలు ఉన్నాయి. కొందరు మంత్రులకు ఇదే చివరి కేబినెట్ సమావేశం అయ్యే అవకాశం కూడా ఉంది. ఈ కీలక కేబినెట్ సమావేశానికి కేంద్ర పర్యాటక సాంస్కృతిక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి కిషన్ రెడ్డి గైర్హాజరు కావటం చర్చనీయాంశంగా మారింది. అనారోగ్య కారణాల వల్ల కేబినెట్ సమావేశంకు హాజరుకాలేక పోతున్నట్లు కేబినెట్ కార్యదర్శికి కిషన్ రెడ్డి సమాచారం ఇచ్చినట్లు తెలిసింది.

Kishan Reddy : టీబీజేపీ నయా బాస్‌ కిషన్‌ రెడ్డి

ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరుగుతున్న కేంద్ర కేబినెట్‌ సమావేశంలో పలు రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రులతో పాటు, తెలంగాణ నుంచి కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డిని తొలగిస్తారని ప్రచారం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రం నుంచి కిషన్ రెడ్డి స్థానంలో బండి సంజయ్‌ను కేంద్ర కేబినెట్‌లోకి తీసుకునే అవకాశాలు ఉన్నట్లు బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు చేపట్టేందుకు సముఖంగాలేని కిషన్ రెడ్డి తన అసంతృప్తిని కేంద్ర పార్టీ పెద్దలకు తెలిపేందుకు ప్రధాని అధ్యక్షతన జరిగే కీలక కేబినెట్ సమావేశంకు హాజరు కాలేదన్న వాదన బీజేపీ వర్గాల నుంచి వినిపిస్తోంది. మరోవైపు ప్రస్తుతం ఢిల్లీలోని తన నివాసంలో ఉన్న కిషన్ రెడ్డి ఈరోజు సాయంత్రం వరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.