బీఆర్ఎస్‌లో హాట్ సీట్‌‍గా ఆ పార్లమెంటు నియోజకవర్గం.. సవాల్‌గా మారిన అభ్యర్థి ఎంపిక, కేసీఆరే పోటీ చేస్తారా?

పార్లమెంటు ఎన్నికలకు సన్నద్ధమవుతున్న బీఆర్ఎస్ కు ఓ నియోకవర్గంలో మాత్రం అభ్యర్థి ఎంపిక సవాల్ విసురుతోంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచి కూడా ఆ నియోజవర్గం నుంచి పోటీ చేసేందుకు నేతలు పెద్ద ఎత్తున ఆశలు పెంచుకున్నారు.

kcr

BRS Hot Seat : ఆ పార్లమెంట్ స్థానం బీఆర్ఎస్ లో హాట్ సీట్ గా మారిపోయింది. ఆ స్థానం నుంచి పోటీ చేస్తే గెలవడం ఖాయమనే ధీమాలో ఉన్నారు గులాబీ నేతలు. రాష్ట్రంలో ఏ పార్లమెంటు సీటుకు లేని పోటీ ఈ నియోజకవర్గానికి ఏర్పడింది. ఈ సీటుకు అభ్యర్థిగా గులాబీ బాస్ ఎవరిని ఖరారు చేస్తారు? అన్నది ఉత్కంఠగా మారింది. స్వయంగా ఈ సీటు నుంచి కేసీఆరే పోటీ చేయొచ్చనే టాక్ కూడా వినిపిస్తోంది. ఇంతకీ ఆ సీటు ఏది?

పార్లమెంటు ఎన్నికలకు సన్నద్ధమవుతున్న బీఆర్ఎస్ కు ఓ నియోకవర్గంలో మాత్రం అభ్యర్థి ఎంపిక సవాల్ విసురుతోంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచి కూడా ఆ నియోజవర్గం నుంచి పోటీ చేసేందుకు నేతలు పెద్ద ఎత్తున ఆశలు పెంచుకున్నారు. ఇటీవల గులాబీ పార్టీ అధికారం కోల్పోయినప్పటికీ నేతల దృష్టి మాత్రం ఆ స్థానంపైనే ఎక్కువ ఉంది. ఆ నియోజకవర్గమే గతంలో మాజీ సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహించిన మెదక్ పార్లమెంటు స్థానం.

Also Read : రుణ‌మాఫీ అమ‌లుపై రేవంత్ స‌ర్కార్ ఫోక‌స్.. పక్కా ప్రణాళికతో ముందుకు..

ఇటీవలి ఎన్నికల్లో బీఆర్ఎస్ కు అధికారం దక్కకపోవడంతో మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డికి మెదక్ ఎంపీగా పోటీ చేసే అవకాశం దక్కపోవచ్చనే టాక్ పార్టీ నేతల్లో వినిపిస్తోంది. దీంతో పలువురి పేర్లు తెరపైకి వస్తున్నాయి. గజ్వేల్ నియోజకవర్గానికి ఇంఛార్జిగా వ్యవహరిస్తున్న ఒంటేరు ప్రతాప్ రెడ్డి ఎంపీగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. పార్టీ అధినేత కేసీఆర్ అత్యంత సన్నిహితుడి గుర్తింపు ఉన్న ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి కూడా ఈ సీటుపై ఆశలు పెట్టుకున్నారు.

ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ లో చేరిన గాలి అనిల్ కుమార్ కూడా ఎంపీగా పోటీ చేసే అవకాశం ఇవ్వాలని పార్టీ పెద్దలను కోరుతున్నారు. ఇక పార్టీ ప్రధాన కార్యదర్శి చాగళ్ల నరేంద్రనాథ్ ఈ స్థానంపై భారీగా ఆశలు పెట్టుకున్నారు. జాతీయ రాజకీయాల్లో రీఎంట్రీ ఇవ్వాలి అనుకుంటే మాత్రం గులాబీ బాస్ కేసీఆర్ స్వయంగా ఈ స్థానం నుంచి రంగంలోకి దిగే అవకాశం ఉంది. మరోవైపు ఈ స్థానం నుంచి ఇతర పార్టీల జాతీయ నేతలు కూడా పోటీ చేసే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతుండటంతో బీఆర్ఎస్ తమ అభ్యర్థిగా ఎవరిని బరిలోకి దించుతుందో అనేది ఆసక్తి రేపుతోంది.

Also Read : బీఆర్‌ఎస్‌ పేరు మార్పుపై ఆసక్తికర పరిణామం.. మళ్లీ టీఆర్‌ఎస్‌గా మార్చాలంటున్న కార్యకర్తలు