Medaram Jatara : అమ్మవార్ల వన ప్రవేశం.. ముగియనున్న మేడారం జాతర
వైభవంగా జరుగుతున్న మేడారం సమ్మక్క- సారలమ్మ జాతర.. 2022, ఫిబ్రవరి 19వ తేదీ శనివారంతో ముగియనుంది. సాయంత్రం అమ్మవార్లు తిరిగి వనప్రవేశం చేయనున్నారు. దీంతో ఈ మహా జాతర...

Medaram
Sammakka Sarakka 2022 : మేడారం సమ్మక్క – సారలమ్మ జాతరకు భక్తులు పోటెత్తారు. మేడారం వీధులన్నీ భక్తులతో కిటకిటలాడాయి. శుక్రవారం వనదేవతల నిండు జాతరకు భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. క్యూ లైన్లు కిక్కిరిసిపోయాయి. జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరించేందుకు వచ్చిన వారితో జనసంద్రమైంది. కోటి మందికి పైగా అమ్మవార్లను దర్శించుకొని ఉంటారని అంచనా వేస్తున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగు రాష్ట్రాలైన ఛత్తీస్ గడ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా నుంచి భక్తులు తరలివస్తున్నారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, రేణుకా సింగ్, రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, ఇంద్రకిరణ్ రెడ్డి, గంగుల కమలాకర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్, తదితర ప్రముఖులు అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించారు.
Read More :Medaram : మేడారంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, వన దేవతలను ఏం కోరుకున్నారంటే
ఇదిలా ఉంటే…వైభవంగా జరుగుతున్న మేడారం సమ్మక్క- సారలమ్మ జాతర.. 2022, ఫిబ్రవరి 19వ తేదీ శనివారంతో ముగియనుంది. సాయంత్రం అమ్మవార్లు తిరిగి వనప్రవేశం చేయనున్నారు. దీంతో ఈ మహా జాతర ముగియనుంది. సమ్మక్క-సారలమ్మలు గద్దెలపైనే కొలువుదీరడంతో అమ్మవార్లను దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. అమ్మవార్లకు నిలువెత్తు బెల్లాన్ని కానుకగా సమర్పిస్తూ తన్మయత్వం చెందుతున్నారు. చీరెసారెలు, ఒడిబియ్యం సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. మరోవైపు భక్తుల కోసం ఏర్పాట్లను మంత్రులు అక్కడే ఉండి పరిశీలిస్తున్నారు. ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూస్తున్నారు. ఇక నిన్న పలువురు ప్రముఖులు దేవేరులకు మొక్కులు చెల్లించుకున్నారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ సీనియర్ నేత లక్ష్మణ్ మేడారం చేరుకుని అమ్మవార్లను దర్శించుకున్నారు. వన జాతరలో మొక్కులు చెల్లించుకున్నారు.