MLA Raja Singh: పాకిస్థాన్ నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి: రాజాసింగ్

బెదిరింపు కాల్స్ వస్తున్నాయని హైదరాబాద్ లోని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ట్విట్టర్ లో తెలిపారు. ఈ మేరకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, తెలంగాణ డీజీపీ అంజన్ కుమార్, హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ను ట్యాగ్ చేశారు. ఓ పాకిస్థానీ నుంచి ఇవాళ మధ్యాహ్నం 3.34 గంటలకు తనకు వాట్సాప్ కాల్ వచ్చిందని తెలిపారు.

Mangal Hot Police Notices to MLA Rajasingh

Raja Singh: బెదిరింపు కాల్స్ వస్తున్నాయని హైదరాబాద్ లోని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ట్విట్టర్ లో తెలిపారు. ఈ మేరకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, తెలంగాణ డీజీపీ అంజన్ కుమార్, హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ను ట్యాగ్ చేశారు. ఓ పాకిస్థానీ నుంచి ఇవాళ మధ్యాహ్నం 3.34 గంటలకు తనకు వాట్సాప్ కాల్ వచ్చిందని తెలిపారు.

తనకు కాల్ చేసిన వ్యక్తి వద్ద తన కుటుంబ వివరాలు అన్నీ ఉన్నాయని చెప్పారు. హైదరాబాద్ లో తమ స్లీపర్ సెల్ యాక్టివ్ గా ఉందని, తనను చంపేస్తామని ఆ వ్యక్తి అన్నాడని రాజాసింగ్ వివరించారు. తనకు ప్రతిరోజు ఇటువంటి కాల్స్ వస్తున్నాయని చెప్పారు. కాగా, వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఎమ్మెల్యే రాజాసింగ్‌ కు కొన్ని వారాల క్రితం హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే.

ఆయనపై పీడీ చట్టాన్ని కూడా రద్దు చేసింది. ఇటీవలే రాజాసింగ్‌ను పోలీసులు మరో వివాదంలో అరెస్టు చేసి విడిచిపెట్టారు. ప్రభుత్వం తనకు కేటాయించిన బుల్లెట్ ఫ్రూప్ వాహనం పదే పదే పాడవుతోందని దాన్ని ప్రగతి భవన్ వద్దకు రాజాసింగ్ తీసుకొచ్చి, దాన్ని ప్రగతి భవన్ ముందే వదిలేసి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో రాజాసింగ్‌ను పోలీసులు అరెస్టు చేసి అనంతరం విడిచిపెట్టారు.

Hyderabad Metro Jobs : హైదరాబాద్ మెట్రో రైల్ లో పలు ఉద్యోగ ఖాళీల భర్తీ