Vijayashanti
Vijayashanti: సినీ నటి, కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి దంపతులకు బెదిరింపులు రావడం కలకలం రేపింది. చంద్రశేఖర్ రెడ్డి అనే వ్యక్తి మీకు నరకం అంటే ఏంటో చూపిస్తా అంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు.
చంద్రశేఖర్ రెడ్డి విజయశాంతి సోషల్ మీడియా అకౌంట్ ను మెయింటెన్ చేసేవాడు. సోషల్ మీడియాలో విజయశాంతిని ఉన్నత స్థానాలకు తీసుకెళ్తానని నమ్మబలికాడు. దీంతో చంద్రశేఖర్ రెడ్డిని నమ్మి పెద్దమొత్తంలో విజయశాంతి దంపతులు డబ్బులు ఇచ్చారు.
సోషల్ మీడియా అకౌంట్ ను మెయింటెన్ చేయకుండా వదిలేయడంతోపాటు.. ప్రశ్నించినందుకు నరకం అంటే ఏమిటో చూపిస్తానంటూ విజయశాంతి దంపతులపై బెదిరింపులకు పాల్పడ్డాడు. విజయశాంతిని బెదిరిస్తూ చంద్రశేఖర్ రెడ్డి ఎస్ఎంఎస్, మెయిల్స్ ను పంపించాడు. దీంతో విజయశాంతి అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.